1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. YS Jagan Mohan Reddy Reached 500 KM Mark

జగన్ పాదయాత్ర.. 500 కిలోమీటర్లు పూర్తి.. మొక్కనాటారు..

వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. జ‌గ‌న్ అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రం మండ‌లం గొట్లూరులో త‌న పాద‌

YS Jagan Mohan Reddy
వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. జ‌గ‌న్ అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రం మండ‌లం గొట్లూరులో త‌న పాద‌యాత్ర కొన‌సాగించారు. దీంతో జగన్ పాదయాత్ర శనివారంతో 500 కిలో మీటర్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా జగ‌న్ మొక్క‌నాటారు.
 
ఇప్పటివరకూ అనంతపురం నియోజకవర్గంలోని గుంతకల్, తాడపత్రి, ఉరవకొండ, రాప్తాడు, అనంతపురం అర్బన్ నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్ర సాగింది. ధర్మవరం నియోజకవర్గంలోనూ జగన్ పాదయాత్ర చేశారు.
 
ఇకపోతే.. ఆదివారం జ‌గ‌న్‌ తుమ్మల, తిప్పేపల్లి క్రాస్‌, రావులచెరువు ఎస్సీ కాలనీల మీదుగా ప్రజాసంకల్పయాత్రను కొన‌సాగిస్తారు. ఆదివారం ఉదయం 11 గంటలకు రావులచెరువు గ్రామంలో త‌మ‌ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ, రాష్ట్ర స‌ర్కారుని విమ‌ర్శిస్తూ జ‌గ‌న్ పాద‌యాత్ర కొన‌సాగుతోంది.
About Writer
selvi
తర్వాతి కథనం
ట్వట్టర్‌లో సరికొత్త ఫీచర్... ఫేస్‌బుక్‌కు ధీటుగా...