1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. YS Jagan uncle ys anand reddy passed away

జగన్ పెదనాన్న వైఎస్ ఆనంద్ రెడ్డి మృతి... పులివెందులలో అంత్యక్రియలు

YS Jagan
YS Jagan
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. జగన్ పెదనాన్న వైఎస్ ఆనంద్ రెడ్డి మృతి చెందారు. ఈయన వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడు. తన పెదనాన్న మరణ వార్త తెలుసుకున్న జగన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. శనివారం పులివెందులలో జరగనున్న వైఎస్ ఆనంద్ రెడ్డి అంత్యక్రియల్లో జగన్ స్వయంగా పాల్గొననున్నట్లు వైసీపీ వర్గాలు వెల్లడించారు.
 
అటు ఆనంద్ రెడ్డి అకాల మరణంతో ఉమ్మడి కడప జిల్లాతో పాటు ఆయన స్వగ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆనంద్ రెడ్డి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. 
 
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి సోదరుడైన వైఎస్ కొండారెడ్డి కుమారుడే ఈ వైఎస్ ఆనంద్ రెడ్డి. ఆ రకంగా ఆనంద్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వరుసకు అన్నదమ్ములు అవుతారు. ఇక వైఎస్ ఆనంద్ రెడ్డి సతీమణి సుశీలమ్మ గతేడాది కన్నుమూశారు. వైఎస్ ఆనంద్ రెడ్డికి సునీత అనే కూతురు ఉన్నారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
మైనింగ్ కాంప్లెక్స్‌లో పేలుడు.. 18మంది బొగ్గు గని కార్మికులు మృతి