మేషం : నిత్యావసర వస్తు స్టాకిస్టులు, వ్యాపారులకు చికాకులు తప్పవు. దైవ, సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత మిత్రుల నుంచి ఒక ముఖ్య సమాచారం గ్రహిస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. దంపతుల మధ్య కలహాలు, చికాకులు తలెత్తే ఆస్కారం ఉంది. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. వృషభం : వస్త్ర, ఫ్యాన్సీ, మందులు, స్టేషనరీ, వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదాపడతాయి. ఖర్చులు, చెల్లింపులు విపరీతంగా ఉంటాయి....