శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

06-06-2021 ఆదివారం రాశి ఫలితాలు - ఆదిత్యుడిని ఎర్రని పూలతో ఆరాధించినా...

మేషం : మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. మత్స్యు కోళ్ళ వ్యాపారస్తులకు కలిసివస్తుంది. నిరుద్యోగులకు ఆశాజనకం. విందులు, వినోదాలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. దూర ప్రయాణాలలో ఇబ్బందులు తలెత్తుతాయి. మీ హద్దుల్లో ఉండటం అన్ని విధాలా క్షేమదాయకం. 
 
వృషభం : ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చేసుకోవడం ఉత్తమం. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. 
 
మిథునం : గృహ నిర్మాణాలు, మరమ్మతుల్లో వ్యయం మీ అంచాలను మించుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ధనసహాయం, ఆదాయ వ్యయాల్లో ఏకాగ్రత వహించండి. రచయితలు, కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
కర్కాటకం : మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించే వారుండరు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించండి. మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లోనూ, వస్తు నాణ్యతలోనూ మెళకువ అవసరం. కుటుంబీలు నిర్లక్ష్యం మీకెంతో చికాకు కలిగిస్తుంది. 
 
సింహం : ఆర్థికంగా ఎదగటానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడతాయి. వృత్తుల వారికి పురోభివృద్ధి, గుర్తింపు, సదావకాశాలు లభిస్తాయి. 
 
కన్య : రాజకీయ రంగాల వారికి ప్రభుత్వ పిలుపు అందుతుంది. మీ కళత్ర మొండివైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. కార్యసాధనలో లక్ష్యాలు సాధిస్తారు. కాంట్రాక్టర్లు చేపట్టిన పనులు ఏమంత సంతృప్తినివ్వజాలవు. స్త్రీలకు అధిక శ్రమ, ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. 
 
తుల : చిన్నతరహా పరిశ్రమల వారికి అనుకూలమైన సమయం. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. మీ లక్ష్యం మంచిదైనా గోప్యంగా ఉంచండి. కొత్త రుణాలు అన్వేషిస్తారు. మీ సంతానం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. 
 
వృశ్చికం : కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. సొంతంగా వ్యాపారం, సంస్థలు స్థాపించాలన్న మీ ధ్యేయం త్వరలో కార్యరూపం దాల్చుతుంది. చేపట్టిన పనులలో నెమ్మదిగా మార్పులు సంభవిస్తాయి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. 
 
ధనస్సు : స్త్రీలతో మితంగా సంభాషించండి. రాజకీయ నాయకులకు విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకం. మీ ధైర్య సాహసాలకు, కార్యదీక్షకు మంచి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. కాస్త కష్టించి పనిచేస్తే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 
 
మకరం : ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్ రంగాల వారికి అనుకూలమైన కాలం. మొండిబాకీలు వసూలు కాగలవు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. స్త్రీలకు నూతన వ్యక్తుల పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. మీ మాటకు, ఇంటా బయటా ఆదరణ లభిస్తుంది. 
 
కుంభం : సాహస ప్రయత్నాలు విరమించండి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి పనిభారం అదికంగా ఉంటుంది. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. అనుకోని అతిథులు ద్వారా ముఖ్య విషయాలు గ్రహిస్తారు. గృహంలో మార్పులు, చేర్పులు చేస్తారు. మిత్రులతో సమస్యలు తలెత్తవచ్చు. జాగ్రత్త వహించండి. 
 
మీనం : రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. నూనె, ఎండుమిర్చి వ్యాపారులకు అనుకూలమైన కాలం. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశఆలు లభిస్తాయి. మీ యత్నాలకు ఆత్మీయుల సహాయ సహకారాలు అందిస్తారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది.