1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 24-08-2026 Daily Astrology

24-08-2026 సోమవారం ఫలితాలు - మీ ఓర్పునకు పరీక్షా సమయం...

Daily Horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
మీ ఓర్పునకు పరీక్షా సమయం. అప్రమత్తంగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలు తగవు. దంపతుల మధ్య సఖ్యత లోపం. ఆలోచనలతో సతమతమవుతారు. పనులు మందకొడిగా సాగుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మీ మాటకు ఎదురుండదు. ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు, నగదు స్వీకరణ, చెల్లింపుల్లో జాగ్రత్త. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆప్తులతో సంభాషిస్తారు.
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రముఖులకు చేరువవుతారు. ప్రత్యర్థులతో జాగ్రత. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఖర్చులు అధికం. అవసరాలు నెరవేరుతాయి. కొత్త పనులు చేపడతారు. దంపతుల మధ్య దాపరికం తగదు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ప్రయాణం తలపెడతారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. చేబదుళ్లు స్వీకరిస్తారు. స్థిమితంగా పనులు పూర్తిచేస్తారు. వాహనచోదకులకు సమస్యలు ఎదురవుతాయి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సమర్ధతను చాటుకుంటారు. పదవులు స్వీకరణకు అనుకూలం. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్లు వదిలేయండి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆహ్వానం అందుకుంటారు. జూదాల జోలికి పోవద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కుటుంబ పరిస్థితులు నిరుత్సాహపరుస్తాయి. సోదరుల మాటతీరు కష్టమనిపిస్తుంది. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఆప్తులతో సంభాషిస్తారు. ఖర్చులు విపరీతం. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. సన్నిహితులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ఖర్చులు విపరీతం. ఏ పనీ చేయబుద్ధి కాదు. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆత్మస్థైర్యంతో మెలగండి. కార్యసాధనకు ఓర్పు, కృషి ప్రధానం. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. ఆలోచనలతో సతమతమవుతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1234 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
మీ కష్టం ఫలిస్తుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పనులు త్వరితగతిన సాగుతాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. స్థిరాస్తి వ్యవహారంలో మెలకువ వహించండి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మీ కష్టం ఫలించదు. మీ సమర్థత వేరొకరికి అనుకూలిస్తుంది. నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. పట్టుదలతో యత్నాలు సాగించండి. విలువైన వస్తువులు జాగ్రత్త. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
సంప్రదింపులతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాల భోజనం. కొంత మొత్తం ధనం అందుతుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. పనులు అర్ధాంతంగా ముగిస్తారు. పిల్లల మొండితనం అసహనం కలిగిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఖర్చులు విపరీతం. రావలసిన ధనం అందదు. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. కొత్తపరిచయాలేర్పడతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. గుట్టుగా యత్నాలు సాగించండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు.
About Writer
పి.ప్రసూనా రామన్
తర్వాతి కథనం
23-08-2016 నుంచి 29-08-2026 వరకు ఫలితాలు