1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 22-08-2026 Daily Astrology

22-08-2026 శనివారం నాటి మీ రాశి ఫలితాలు - బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు

Daily Astrology
మేషం: అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కొన్ని సమస్యల నుండి బయటపడతారు. ఖర్చులు అధికం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితుల కలయికకు వీలుపడదు. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఖర్చులు సామాన్యం. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. పరిచయస్తులను కలుసుకుంటారు. వాహనం ఇతరులకు ఇవ్వవద్దు.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
రుణ సమస్య పరిష్కారమవుతుంది. ఖర్చులు అధికం. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా శ్రమించవద్దు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. గృహ మరమ్మతులు చేపడతారు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లావాదేవీలతో తీరిక ఉండదు. విశ్రాంతి లోపం, అకాల భోజనం. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. చెల్లింపులు, పత్రాల రెన్యూవల్‌లో అలక్ష్యం తగదు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అనుకూలతలు ఉన్నాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. ఆత్మీయుల సలహా పాటిస్తారు. ప్రణాళికలు వేసుకుంటారు. తలపెట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. నగదు, వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
భేషజాలకు పోవద్దు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఎదుటివారి అంతర్యం గ్రహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. శ్రీమతి సలహా పాటించండి. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలకు ధనం అందుతుంది. పనులు హడావుడిగా సాగుతాయి.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. రావలసిన ధనం అందుతుంది. వివాదాలు సద్దుమణుగుతాయి. ఖర్చులు అధికం, కానీ ప్రయోజనకరం. ఆప్తులకు సాయం అందిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు
వ్యవహారాలతో హడావుడిగా ఉంటారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. ప్రలోభాలకు లొంగవద్దు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. సన్నిహితులతో సంభాషిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పత్రాల రెన్యూవల్‌లో మెలకువ వహించండి.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ప్రణాళికలు వేసుకుంటారు. స్థిరాస్తి ద్వారా ధనం అందుతుంది. ఒక సమస్య నుండి బయటపడతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రతికూలతలు ఎదురవుతాయి. వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఖర్చులు విపరీతం. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. విలువైన వస్తువులు జాగ్రత్త. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
కార్యం సిద్ధిస్తుంది. యత్నాలను ఆప్తులు ప్రోత్సహిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ఒక పట్టాన సాగవు. పత్రాలు అందుకుంటారు. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి.
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. పరిచయస్తులు ధన సహాయం అడుగుతారు. కొంత మొత్తంలో సాయం చేయండి. ప్రముఖుల సందర్శనకు వీలుపడదు. చేపట్టిన పనులు అర్ధాంతరంగా ముగిస్తారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు.
About Writer
పి.ప్రసూనా రామన్
తర్వాతి కథనం
ఇంద్రకీలాద్రి కొండపై భోజనశాల.. లడ్డూ పోటు భవనాలు