21-08-2026 శుక్రవారం నాటి మీ రాశి ఫలితాలు - అనవసర విషయాలకు దూరంగా ఉండండి
Daily Astrology
పాత బాకీలు వసూలవుతాయి. ప్రణాళికలు వేసుకుంటారు. సమయస్ఫూర్తిగా మెలుగుతారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. స్వశక్తితో అనుకున్నది సాధిస్తారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. గృహ మరమ్మతులు చేపడతారు. వాహనం, విలువైన వస్తువులు జాగ్రత్త.
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ఖర్చులు సామాన్యం. నిలిపివేసిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సమర్థతను చాటుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. పనులు త్వరితగతిన సాగుతాయి. ఖర్చులు విపరీతం. నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. కొత్త వ్యక్తులను ఒక కంట కనిపెట్టండి. కనిపించకుండా పోయిన వస్తువులు లభిస్తాయి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంతోషకరమైన వార్త వింటారు. మీ శ్రమ ఫలిస్తుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. కీలక సమావేశంలో పాల్గొంటారు.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారాలతో తీరిక ఉండదు. తొందరపాటు నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. చెల్లింపుల్లో జాగ్రత్త. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ఒక పట్టాన పూర్తి కావు. నోటీసులు అందుకుంటారు.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అనవసర విషయాలకు దూరంగా ఉండండి. మీ గౌరవానికి భంగం కలిగే సూచనలు ఉన్నాయి. విమర్శలు పట్టించుకోవద్దు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. దంపతుల మధ్య అకారణ కలహం. చీటికిమాటికి అసహనం చెందుతారు. వివాదాలు జటిలమవుతాయి.
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లావాదేవీలతో తీరిక ఉండదు. ఎదుటివారి అంతర్యం అవగతమవుతుంది. సందర్భానికి తగ్గట్టుగా వ్యవహరిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు
వ్యవహార పరిజ్ఞానంతో నెట్టుకొస్తారు. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. పత్రాలు, వస్తువులు జాగ్రత్త. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి.
ధనస్సు: మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆటంకాలను అధిగమిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. సంప్రదింపులకు అనుకూలం. ఆప్తుల సలహా పాటించండి. పిల్లల విజయం సంతోషాన్నిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు.
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
పట్టుదలతో శ్రమించండి. పరిస్థితులు అనుకూలిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. కొత్త పనులు చేపడతారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరొకదానికి వ్యయం చేస్తారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు.
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
అన్ని విధాలా కలిసివచ్చే సమయం. ఉల్లాసంగా గడుపుతారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆహ్వానం అందుకుంటారు.
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆశించిన ఫలితం దక్కుతుంది. మానసికంగా కుదుటపడతారు. పెద్ద మొత్తంలో సహాయం తగదు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. స్థిరాస్తి కొనుగోలుపై దృష్టి పెడతారు. సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
