1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 27-03-2026 Your Daily Horoscope

27-03-2026 శుక్రవారం ఫలితాలు - రుణసమస్య నుంచి బయటపడతారు

daily horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
వ్యవహారానుకూలత ఉంది. సముచిత నిర్ణయం తీసుకుంటారు. రావలసిన ధనం అందుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ వీలుపడదు. సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. ఇతరుల నమ్మవద్దు, నోటీసులు అందుకుంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సంకల్పం సిద్ధిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఇంటి విషయాలపై దృష్టి సారిస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. చేపట్టిన పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. 
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. అతిగా ఆలోచించవద్దు. ఆప్తులతో సంభాషిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ప్రయాణం తలపెడతారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
శ్రమించినా ఫలితం ఉండదు. మీ కష్టం వేరొకరికి కలిసివస్తుంది. చీటికిమాటికి చికాకుపడతారు. మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. ఖర్చులు అధికం. శుభకార్యానికి హాజరవుతారు. కానుకలు ఇచ్చి పుచ్చుకుంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. యత్నాలను ఆప్తులు ప్రోత్సహిస్తారు. పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు. ఆకస్మిక ప్రయాణం తల పెడతారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సన్మాన, సంస్కరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏకాగ్రతో వాహనం నడపండి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను వదులుకోవద్దు. అపరిచితులతో జాగ్రత్త. చేపట్టిన పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాల భోజనం బాధ్యతలు స్వీకరిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఖర్చులు విపరీతం. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. దళారులతో జాగ్రత్త. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఎంత శ్రమించినా ఫలితం అంతంత మాత్రమే. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అన్యమనస్కంగా గడుపుతారు. ఊహించని ఖర్చులెదురవుతాయి. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. పత్రాల సవరణలు సాధ్యమవుతాయి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లక్ష్యాన్ని సాధిస్తారు. ధనలాభం ఉంది. ఉల్లాసంగా గడుపుతారు. మీ సాయంతో ఒకరికి లబ్ధిచేకూరుతుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఉల్లాసంగా గడుపుతారు. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. కీలక పత్రాలు అందుకుంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. యాదృచ్చికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. ఒంటెద్దు పోకడ సరికాదు. ప్రముఖుల జోక్యం అనివార్యం. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పనులు ఒక పట్టాన సాగవు, అస్వస్థతకు గురప్వతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
చాకచక్యంగా అడుగులేస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. ఖర్చులు విపరీతం. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. ఆప్తులతో సంభాషిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. కనిపించకుండా పోయిన పత్రాలు లభిస్తాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
రుణసమస్య నుంచి బయటపడతారు. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. చిన్న విషయానికే చికాకుపడతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు.
తర్వాతి కథనం
శ్రీరామనవమి రోజున ఈ రాశుల వారికి అంతా శుభం