1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 26-03-2026 Your Daily Horoscope

26-03-2026 గురువారం ఫలితాలు - పొగడ్తలకు పొంగిపోవద్దు

daily astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
గ్రహాల సంచారం బాగుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ఖర్చులు సామాన్యం, పనులు చురుకుగా సాగుతాయి. కొత్తయత్నాలు చేపడతారు. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. సంతానం చదువులపై దృష్టిపెడతారు. వేడుకలో అత్యుత్సాహం ప్రదర్శించవద్దు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఉత్సాహంగా అడుగులేయండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ముఖ్యమైన పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు సంతృప్తికరం. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. బందువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. గృహ మరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త 
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆశయసిద్ధికి కృషి, పట్టుదల ప్రధానం. ధైర్యంగా యత్నాలు కొనసాగించండి. అనుకోని ఖర్చులు ఆందోళన కలిగిస్తుంది. దంపతుల మధ్య అకారణ కలహం, ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. ఆస్తులను కలుసుకుంటారు. ప్రయాణంలో ఒకింత అవస్థలు తప్పవు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆర్థికలావాదేవీలతో సతమతమవుతారు. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం, చెల్లింపుల్లో జాగ్రత్త పనులు వేగవంతమవుతాయి. అప్రమత్తంగా ఉండాలి. పొగడ్తలకు పొంగిపోవద్దు. ఎదుటి వారి ఆంతర్యం గ్రహించండి. ప్రముఖులకు స్వాగతం, ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు, 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ప్రయోజనకరం. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. గృహమార్పు చేపడతారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త, ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అనుకున్న కార్యం సాధిస్తారు. ఖర్చులు సామాన్యం. చేపట్టిన పనులు హడావుడిగా, ఆత్మీయులతో సంభాషిస్తారు. విలాస వస్తువులు దొనుగోలు చేస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి మేలు జరుగుతుంది. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. దైవ కార్యంలో పాల్గొంటారు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లావాదేవీలు కొలిక్కివస్తాయి. సమస్యలను ధైర్యంగా ఎదుర్కుంటారు. ఒక వ్యవహారం మీకు అనుకూలిస్తుంది. ఖర్చులు సామాన్యం. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. అప్రమత్తంగా ఉండాలి. అపరిచితులతో మితంగా సంభాషించండి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సంకల్ప సిద్ధికి మరింత శ్రమించాలి. పరిచయస్తుల వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. ఊహించని ఖర్చు ఆందోళన కలిగిస్తుంది. చెల్లింపుల్లో మెలకువ వహించండి. ఆత్మీయులను కలుసుకుంటారు. ఆందోళన తగ్గి కుదుటపడతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సమర్థతను చాటుకుంటారు. విలాసాలకు వ్యయం చేస్తారు. పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త, అపరిచితులతో మితంగా సంభాషించండి. పనులు చురుకుగా సాగుతాయి. కీలక వ్యవహారంలో మెలకువ వహించండి. కొత్తయత్నాలు చేపడతారు. వాహనం ఇతరులకు ఇవ్వవద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అనుకూలతలు అంతంత మాత్రమే. బంధుమిత్రులతో విభేదిస్తారు పట్టింపులకు పోవద్దు, దుబారా ఖర్చులు విపరీతం, పనులు, మొండిగా పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లక్ష్యసాధనకు మరింత శ్రమించాలి. ఆప్తులు ఆదుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. పనుల్లో శ్రమ అధికం. జూదాలు, బెట్టింగ్‌లకు పాల్పడవద్దు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అన్ని విధాలా కలిసివచ్చే సమయం. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. బంధువులతో కాలక్షేపం చేస్తారు. విలాసాలకు వ్యయం చేస్తారు. మీ జోక్యం అనివార్యం, ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు.
తర్వాతి కథనం
25-03-2026 బుధవారం ఫలితాలు-దంపతుల మధ్య అకారణ కలహం