సంబంధిత వార్తలు
- 24-03-2026 మంగళవారం ఫలితాలు - ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు
- 23-03-2026 సోమవారం దినఫలాలు : సమర్ధతపై నమ్మకం సన్నగిల్లుతుంది...
- 22-03-2026 ఆదివారం ఫలితాలు - మీ తప్పిదాలను సరిదిద్దుకునే..?
- 21-03-2016 శనివారం ఫలితాలు- చాటుమాటు వ్యాఖ్యలు పట్టించుకోవద్దు
- 20-03-2016 శుక్రవారం ఫలితాలు - ధన సమస్య ఎదురయ్యే సూచనలున్నాయి..
25-03-2026 బుధవారం ఫలితాలు-దంపతుల మధ్య అకారణ కలహం
Astrology
ఆర్థిక లావాదేవీలతో సతమతమవుతారు. ప్రబోభాలకు లొంగవద్దు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. పెద్ద ఖర్చు తగులుతుంది. బంధువుల రాక బ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు దంపతుల మధ్య అకారణ కలహం. ఆప్తులను కలుసుకుంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఉత్సాహంగా యత్నాలు సాగించండి. అవకాశం చేజారినా నిరుత్సాహపడవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఖర్చులు సామాన్యం. నోటీసులు అందుకుంటారు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. కీలక పత్రాలు జాగ్రత్త.
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంతోషకరమైన వార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. కీలక అంశాలపై పట్టుసాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. రావలసిన ధనం అందుతుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. శుభకార్యానికి హాజరవుతారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. లక్ష్యసాధన వైపు అడుగులేస్తారు. ఒప్పందాలకు అనుకూలం. ఏకపక్ష నిర్ణయాలు తగవు. సన్నిహితులను సంప్రదించండి. స్థిరాస్తి ధనం అందుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. సంకల్పం సిద్ధిస్తుంది. ఖర్చులు సామాన్యం, పెద్ద మొత్తం ధన సహాయం తగదు. పనులు చురుకుగా సాగుతాయి. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. స్థిమితంగా ఆలోచించి పనులు పూర్తి చేస్తారు. ఇతరుల విషయంలో అనవసర జోక్యం తగదు. నోటీసులు అందుతుంటారు. సోదరులతో చర్చలు జరుపుతారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
గ్రహస్థితి అనుకూలంగా ఉంది, మాటతీరుతో ఆకట్టుకుంటారు. లావాదేవీలు ప్రశాంతంగా సాగుతాయి. ఖర్చులు అధికం, సంతానం చదువులపై దృష్టి సారిస్తారు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రతికూలతలు అధికం. ఆశావహదృక్పథంతో మెలగండి. వ్యవహారాలతో సతమతమవుతారు. తొందరపాటు నిర్ణయాలు తగవు. సన్నిహితుల సలహా పాటించండి. కీలక అంశాలపై దృష్టి పెడతారు. చేపట్టిన పనులు సాగవు. జూదాలు, బెట్టింగ్‌లకు పాల్పడవద్దు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ పట్టుదల కొందరికి స్ఫూర్తినిస్తుంది. ఉత్సాహంగా గడుపుతారు. ఆడంబరాలకు వ్యయం చేస్తారు. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. అపరిచితులతో జాగ్రత్త. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సంకల్పసిద్ధికి ఓర్పు ప్రధానం, యత్నాలు కొనసాగించండి. సాయం ఆశించవద్దు. ప్రణాళికలు వేసుకుంటారు. పన్ను చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. కొత్త పనులు ప్రారంభిస్తారు. సంతానం చదువులపై దృష్టి పెడతారు. మీ ప్రమేయంతో ఒకరికి మంచి జరుగుతుంది.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చెల్లింపులో అలక్ష్యం తగదు. వ్యతిరేకులతో జాగ్రత్త. కొందరి వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. విమర్శలు పట్టించుకోవద్దు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
చాకచక్యంగా వ్యవహరిస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరులతో సంభాషిస్తారు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ప్రయాణం తల పెడతారు.
తర్వాతి కథనం
