24-03-2026 మంగళవారం ఫలితాలు - ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యూహాత్మకంగా అడుగు ముందుకేస్తారు. సన్నిహితులు ప్రోత్సాహం ఉంటుంది, రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. కీలక చర్చల్లో పాల్గొంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఆప్తులకు సాయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. కొత్త యత్నాలు చేపడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. బంధువులతో సంభాషిస్తారు. పత్రాల రెన్యువల్లో అప్రమత్తంగా ఉండాలి.
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లక్ష్యసాధనకు మరింత శ్రమించాలి. యత్నాలు కొనసాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెంటాడుతుంది. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారానుకూలత ఉంది. లక్ష్యం సాధిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. రావలసిన ధనం ఆలస్యంగా అందుతుంది. చెల్లింపుల్లో జాప్యం తగదు, సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. అందరితోను మితంగా సంభాషించండి. బాధ్యతలు ఇతరులకు అప్పగించవచ్చు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆశావహదృక్పధంతో యత్నాలు సాగించండి. ఖర్చులు విపరీతం. చేపట్టిన పనులు ఒక పట్టాన సాగవు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. దంపతుల మధ్య అవగాహన లోపం. చిన్న విషయానికే చికాకుపడతారు. ఆత్మీయులను కలుసుకుంటారు, ఇంటి విషయాలపై దృష్టిపెడతారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ముఖ్యమైన అంశాలపై పట్టు సాధిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. ఖర్చులు విపరీతం. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. అనవసర జోక్యం తగదు. ప్రముఖులకు స్వాగతం పలుకుతారు. వాహనం ఇతరులకివ్వవద్దు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. ఖర్చులు ప్రయోజనకరం. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఆత్మీయులతో సంభాషిస్తారు. మొదలెట్టిన పనులు త్వరితగతిన సాగుతాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లక్ష్యం నెరవేరుతుంది. వస్త్రప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. సన్నిహితులు సాయం అందిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. రావలసిన ధనం అందుతుంది, పరిచయస్తులకు ధనసహాయం చేస్తారు. శుభకార్యానికి హాజరవుతారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. ప్రముఖుల రాక సంతోషం కలిగిస్తుంది. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. పెద్దల వ్యాఖ్యలు మీ పై సత్ప్రభావం చూపుతాయి.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అనుకూలతలున్నాయి. తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. పనులు వేగవంతమవుతాయి. మీ సామర్ధ్యంపై సమ్మకం కలుగుతుంది. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు, సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లావాదేవీలు ముగుస్తాయి. ఖర్చులు విపరీతం. కొన్ని పనులు అనుకోకుండా పూర్తవుతాయి. ఒప్పందాల్లో ఆచితూచి అడుగేయాలి. తొందరపాటు నిర్ణయాలు తగవు. గృహనిర్మాణం పూర్తికావస్తుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు.
