1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
  4. Your Weekly Tarot Horoscope Is Here For January 11 - 17, 2026

11-01-2026 నుంచి 17-01-2026 వరకు మీ వార రాశిఫలితాలు

Weekly Horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
వ్యవహారజయం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనులు వేగవంతమవుతాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు విపరీతం. ఆత్మీయులను వేడుకలు, విందుకు ఆహ్వానిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. పరిచయాలు బలపడతాయి. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. సోమవారం నాడు ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. సన్నిహితుల సలహా పాటించండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆందోళన తగ్గి స్థిమితపడతారు. సంతానం దూకుడు అదుపుచేయండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిన్నవ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అన్ని రంగాల వారికీ యోగదాయకమే. వేడుకను ఘనంగా చేస్తారు. పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. బంధుత్వాలు బలపడతాయి. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. స్థిరాస్తి ధనం అందుతుంది. బుధవారం నాడు పెద్దమొత్తం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. న్యాయ, వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ప్రయాణంలో ఒకింత అవస్థలు ఎదుర్కుంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆదాయం బాగుంటుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. ధనానికి ఇబ్బంది ఉండదు. శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. వేడుకకు ఆహ్వానం అందుకుంటారు. సోదరీ సోదరులతో కాలక్షేపం చేస్తారు. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. బాధ్యతలు పురమాయించవద్దు. ఆత్మీయులకు శుభవార్త అందిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులు పురస్కారం అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడులకు తరుణం కాదు. విందులు, వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. కొత్త పనులు చేపడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు, ఆదివారం నాడు అందరితోను మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తారు. పెద్దల జోక్యంతో వివాదం సద్దుమణుగుతుంది. సంతానానికి శుభపరిణమాలున్నాయి. ఆహ్వానం అందుకుంటారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు బాధ్యతల మార్పు. వేడుకకు హాజరవుతారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాలభోజనం. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం గ్రహిస్తారు. మంగళవారం నాడు పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తారు. సంతానానికి శుభం జరుగుతుంది. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయంండి. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఆటుపోట్లను అధిగమిస్తారు. ఉద్యోగ బాధ్యతలపై దృష్టిపెట్టండి. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. వేడుకకు హాజరవుతారు. పోటీల్లో విజయం సాధిస్తారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఈ వారం గ్రహాల సంచారం బాగుంది. అనుకున్న కార్యం సఫలమవుతుంది. మానసికంగా కుదుటపడతారు. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆటంకాలెదురైనా పనులు పూర్తి చేయగల్గుతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. ఆత్మీయులతో తరచు సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సన్నిహితులను విందులు, వేడుకకు ఆహ్వానిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
పరిస్థితులు కొంత వరకు అనుకూలంగా ఉన్నాయి. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. స్నేహసంబంధాలు బలపడతాయి. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఎవరిపైనా భారం వేయొద్దు. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సన్నిహితులను విందుకు ఆహ్వానిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. నగదు కీలక పత్రాలు జాగ్రత్త. సంతానం దుడుకుతనం ఇబ్బంది కలిగిస్తుంది. విజ్ఞతతో సమస్య పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగ ఉపాధ్యాయుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
లావాదేవీలు ముగుస్తాయి. ధనలాభం ఉంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. గురువారం నాడు అందరితోను మితంగా సంభాషించండి. అనవసర విషయాలకు ప్రాధాన్యమివ్వవద్దు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. కావలసిన పత్రాలు సమయానికి కనపించవు. చిన్న విషయానికే అసహనం చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వేడుకకు హాజరవుతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. కొత్తసమస్య ఎదురయ్యే సూచనలున్నాయి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. సోమవారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు, కార్యక్రమాలు వాయిదా పడతాయి. సంతానానికి శుభపరిణామాలున్నాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఆశావహదృక్పథంతో మెలగండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. గృహమార్పు కలిసివస్తుంది. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఇతరులపై భారం వేయొద్దు. ఉద్యోగస్తుల పదోన్నతికి అధికారులు సిఫార్సు చేస్తారు. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. హోల్  సేల్ వ్యాపారాలు, స్టాకిస్టుల ఆదాయం బాగుంటుంది. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. అర్ధాంతంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఆదాయం బాగుంటుంది. వేడుకను ఘనంగా చేస్తారు. పరిచయస్తులకు ధనసహాయం చేస్తారు. మంగళవారం నాడు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఎవరినీ అతిగా నమ్మవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తుంటారు. వేడుకకు ఆహ్వానం అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. సంతానం కృషి ఫలిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. హోల్ సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. ముఖ్యులకు స్వాగతం పలుకుతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. ఆర్థిక విషయాల్లో తగిన నిర్ణయం తీసుకుంటారు. కొంతమొత్తం ధనం అందుతుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. పెద్దమొత్తం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. చుట్టుపక్కల వారిని గమనించండి. ఆదివారం నాడు ఏ పని చేయబుద్ధికాదు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. తెగిపోయిన బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. సంతానానికి శుభయోగం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ధన సమస్య ఎదురయ్యే సూచనలున్నాయి. మితంగా ఖర్చుచేయండి. ఆర్భాటాలు, భేషజాలకు పోవద్దు. పరిస్థితులకు అనుగుణంగా మెలగండి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. శుక్రవారం నాడు కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. తరచు సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. సంతానం దూకుడు అదుపుచేయండి. పెద్దల చొరవతో ఒక వివాదం సద్దుమణుగుతుంది. ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి.