1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
  4. health and ayurdevic tips for back pain

శొంఠి పొడి టీ... ఆ సమస్యకు భేషుగ్గా పనిచేస్తుంది... వెల్లుల్లి కూడా...

నడుమునొప్పి చాలామంది మహిళలను ఇబ్బంది పెట్టే సమస్య. నడుము పట్టేయడం, ఆ భాగంలోని కండరాలు, ఎముకలు బలహీనపడడం, గర్భధారణ, ప్రసవం, గర్భాశయంలో సమస్యలు, ఫైబ్రాయిడ్లు వంటి నడుము నొప్పులకు దారితీస్తుంటాయి. ఇలాంటి

health
నడుమునొప్పి చాలామంది మహిళలను ఇబ్బంది పెట్టే సమస్య. నడుము పట్టేయడం, ఆ భాగంలోని కండరాలు, ఎముకలు బలహీనపడడం, గర్భధారణ, ప్రసవం, గర్భాశయంలో సమస్యలు, ఫైబ్రాయిడ్లు వంటివి నడుము నొప్పులకు దారితీస్తుంటాయి. ఇలాంటి సమస్యలను తొలగించుకునేందుకు ఆయుర్వేదంలో చికిత్స ఉంది.
 
పీచు పదార్థం అధికంగా ఉంటే ఆకుకూరలు, కాయగూరలు వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. ముఖ్యంగా కడుపులో గ్యాస్ పెంచే సెనగలు, మసాలా పదార్థాలు వంటి వాటికి దూరంగా ఉండాలి. కూర్చునేటప్పుడు, నిలబడేటప్పుడు భంగిమ చాలా ముఖ్యం. వెన్నెముక నిటారుగా ఉండేలా కూర్చోవాలి. కుర్చీలలో కూర్చున్నప్పుడు వంగినట్లు కూర్చోకూడదు. 
 
ఒక కప్పు నువ్వుల నూనెలో కొద్దిగా వెల్లుల్లి పేస్ట్‌ను కలుపుకుని నడుముకు రాసుకుంటే నొప్పి తగ్గుతుంది. శొంఠి కషాయంలో కొద్దిగా ఆముదం కలుపుకుని నడుముకు రాసుకుంటే కూడా నడుము నొప్పి తగ్గుతుంది. కప్పు నీళ్లలో కొద్దిగా మిరియాలు, లవంగాలు, శొంఠి పొడి వేసుకుని టీలా కాచుకోవాలి. ఈ టీను ప్రతిరోజూ నడుముకు రాసుకోవడం వలన నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
 
దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా తేనెను కలుపుకుని రోజుకు రెండు మార్లు నడుముకు రాసుకోవాలి. కొబ్బరి నూనెను వేడిచేసుకుని అందులో కొద్దిగా కర్పూరం వేసి కరిగించాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత నడుముకు మర్దనా చేసుకుంటే కూడా నొప్పి తగ్గుతుంది. 
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
తొలిరాత్రి... అబ్బాయి చెప్పినట్టు విను! నొప్పి అని దూరం నెట్టేయకు...