1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Chicken prices in telugu states

చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి... కిలో ధర రూ.300

Chicken
చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. ధరల పెరుగుదల కారణంగా సామాన్య ప్రజలు చికెన్ కొనాలంటేనే ఆలోచిస్తున్నారు.  చికెన్ ధరలు పెరగడానికి ప్రధానంగా ఎండల ప్రభావం, ఫారమ్‌లలో ఉత్పత్తి తగ్గడం కారణం అవుతున్నాయి. డిమాండ్ పెరగడం ఇతర కారణాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు కిలో 300 రూపాయల స్థాయికి చేరుకున్నాయి.
 
ముఖ్యంగా హైదరాబాద్, ఖమ్మం వంటి నగరాల్లో స్కిన్‌లెస్ చికెన్ కిలో 280 నుండి 300 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం, అమలాపురం, భీమవరం వంటి ప్రాంతాల్లో కూడా 280 రూపాయల వరకు ధర నమోదైంది. కామారెడ్డిలో 280, వరంగల్‌లో 270, గుంటూరులో 250 నుండి 270 రూపాయల మధ్య చికెన్ అందుబాటులో ఉంది. 
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఫ్రీగా కాన్వా టెక్నాలజీ.. నారా లోకేష్