వేసవి కాలం: సగానికి సగం తగ్గిన చికెన్ ధరలు..
Chicken Rates
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం ఫామ్ రేటు కేవలం 105 రూపాయలుగా ఉండగా, రిటైల్ మార్కెట్‌లో లైవ్ బర్డ్ 132 రూపాయలకే దొరుకుతోంది.
స్కిన్‌లెస్ చికెన్ విషయానికి వస్తే 218 నుండి 230 రూపాయల మధ్య విక్రయిస్తున్నారు. ధరలు తగ్గడంతో మార్కెట్ల వద్ద సందడి మళ్లీ మొదలైంది. కాగా చికెన్ ధరలు సగానికి పైగా తగ్గడంతో సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల కిలో స్కిన్‌లెస్ చికెన్ 200 రూపాయలకే దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి.
