శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 జులై 2021 (14:17 IST)

తెలంగాణాలో సెంచరీ కొట్టి డీజిల్ ధర

తెలంగాణ రాష్ట్రంలో డీజిల్ ధరల ఇపుడు సెంచరీ కొట్టింది. ఇప్పటివరకు కేవలం పెట్రల్ మాత్రమే వంద రూపాయలకుపైగా ఉండగా, ఇపుడు డీజిల్ కూడా సెంచరీదాటింది. నిజానికి పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల పెంపుపై ప్రతిపక్షాలు, ప్రజలు ఎన్ని నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ కేంద్రం మాత్రం పట్టించుకోవడం లేదు. 
 
కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల ప్ర‌తిరోజూ పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణ‌లో లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ.100 మార్క్ దాటేసింది. అదిలాబాద్‌లో అత్య‌ధికంగా లీట‌ర్ డీజిల్ రూ.100.18కి చేరింది. ఇప్ప‌టికే పెట్రోల్ రేటు రూ.100 దాటి చాలా రోజుల‌య్యింది.
 
ప్ర‌స్తుతం హైద‌రాబాద్ నగరంలో పెట్రోల్ ధ‌ర రూ.105.83 ఉండగా, డీజిల్ ధ‌ర రూ.97.96గా పలుకుతోంది. అదిలాబాద్‌కు ర‌వాణా ఛార్జీలు అధికంగా ఉండ‌టంతోనే అక్క‌డ డీజిల్ ధ‌ర ఎక్కువ‌గా ఉంద‌ని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.