గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 జులై 2021 (11:29 IST)

22 నుంచి ములుగు జిల్లాలో వైఎస్ షర్మిల యాత్ర

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 22వ తేదీ నుంచి ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామసహాయం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ములుగులో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
జిల్లా కేంద్రానికి చేరుకొనే షర్మిల... అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పిస్తారు. ఆ తర్వాత గోవిందరావుపేట మండలం పస్రా పసరాకు చేరకుని కొమురంభీం విగ్రహానికి పూలమాల వేస్తారని చెప్పారు. 
 
అనంతరం తాడ్వాయి మండలం లింగాల గ్రామంలో పోడు యాత్ర కార్యక్రమంలో పాల్గొని రైతులతో ముఖాముఖి అవుతారని వివరించారు. రైతులతో సమావేశం తర్వాత పోడు భూములను పరిశీలినకు వెళుతారని తెలిపారు.