సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జెఎస్కె
Last Modified: సోమవారం, 19 జులై 2021 (11:13 IST)

బాబుకు న‌మ్మ‌క‌స్తుడు, అందుకే బ‌క్కిన‌కు టీటీడీపీ అధ్య‌క్ష ప‌ద‌వి

తెలంగాణ తెలుగుదేశం పార్టీకి కొత్త‌ రాష్ట్ర అధ్యక్షుడిగా బక్కిన నర్సింహులును తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నియమించారు. అంటే ఇపుడు తెలంగాణ టీడీపీకి కొత్త బాస్ బ‌క్కిన అన్న‌మాట‌. ఆయ‌న నియామకాన్ని పార్టీ అధినేత చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు.

టీటీడీపీ ప్రెసిడెంట్‌తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్‌లను కూడా ప్రకటించే అవకాశాలున్నాయి. ఎంతో కాలంగా టీటీడీపీ నేత‌గా ఉన్న ఎల్. రమణ టీఆర్ఎస్‌లో చేర‌డంతో ఖాళీ అయిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవిని భర్తీ చేశారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఉన్న వారిలో సీనియర్ నాయకుడు, పైగా చంద్ర‌బాబుకు బాగా న‌మ్మ‌క‌స్తుడిగా పేరొందిన‌ బక్కని నర్సింహులును ఈసారి అవ‌కాశం ఇచ్చారు.

ఇప్ప‌టికే ర‌మ‌ణ వెళ్లిపోవ‌డంతో టీటీడీపీ ఖాళీ అయిపోయింద‌నే అప‌ప్రద చోటుచేసుకుంది. అయితే, త‌మ పార్టీకి గ్రామీణ స్థాయిలో కార్య‌కర్త‌లు చాలా మంది ఉన్నార‌ని, నేత‌లు హ్యాండ్ ఇచ్చినా కార్య‌క‌ర్త‌లు పార్టీకి పునాదుల‌ని చంద్ర‌బాబు అనుయాయులు పేర్కొంటున్నారు. తిరిగి పార్టీని పూర్తి స్థాయిలో ప్ర‌క్షాళ‌న చేసి, కింద నుంచి నిర్మాణం చేయాల‌ని కొత్త అధ్య‌క్షుడికి పార్టీ అధినేత చంద్ర‌బాబు సూచిస్తున్న‌ట్లు తెలుస్తోంది.