1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Fuel prices may come down by Diwali, says Dharmendra Pradhan

హరికేన్ వల్లే ఇంధన ధరలు పెరుగుదల : పెట్రోలియం మంత్రి

కరేబియన్ దీవులతో పాటు అమెరికాలో వచ్చిన హరికేన్ తుఫాను వల్లే దేశంలో ఇంధన ధరలు పెరిగాయని పెట్రోలియం శాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. అయితే, దీపావళి నాటికి ఈ ధరలు దిగివచ్చే అవకాశం ఉందని ఆయన

Fuel prices
కరేబియన్ దీవులతో పాటు అమెరికాలో వచ్చిన హరికేన్ తుఫాను వల్లే దేశంలో ఇంధన ధరలు పెరిగాయని పెట్రోలియం శాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. అయితే, దీపావళి నాటికి ఈ ధరలు దిగివచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. 
 
గత రెండు నెలలుగా ఇంధన ధరలు పెరిగిపోతున్న విషయం తెల్సిందే. దీనిపై దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా ఉంది. ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ, అమెరికాను వణికించిన హార్వే, ఇర్మా తుఫానుల కారణంగా, అంతర్జాతీయంగా రిఫైనరీ ఔట్ పుట్ 13 శాతం పడిపోయిందని... ఈ కారణంగానే ఇంధన ధరలు పెరిగాయన్నారు. 
 
అయితే, దీపావళి నాటికి వీటి ధరలు తగ్గుతాయన్నారు. వచ్చే నెలలో ధరలు తగ్గుముఖం పడతాయని చెప్పారు. రోజువారీ ఇంధన ధరల సమీక్ష చేపట్టినప్పటి నుంచి వీటి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ విధానంపై విమర్శలు వచ్చినప్పటికీ... మంత్రి మాత్రం రోజువారీ ధరల సమీక్ష చాలా పారదర్శకంగా ఉందని సమాధానం చెప్పారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
సీఎం పళనిస్వామి సర్కారును గట్టెక్కించిన తమిళనాడు స్పీకర్...