1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Government eyes reducing import duties on gold, silver

బంగారం, వెండి దిగుమతి సుంకాలు తగ్గించనున్న కేంద్రం ప్రభుత్వం

gold
బంగారం, వెండి దిగుమతి సుంకాలు తగ్గించాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుగుతున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బులియన్ వ్యాపారులు అలాగే ఆభరణాల తయారీదారులు ప్రస్తుతం అమల్లో ఉన్న పదిహేను శాతం సుంకాన్ని ఆరు శాతానికి తగ్గించాలని గట్టిగా కోరుతున్నారు. గతంలో డాలర్ నిల్వలను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సుంకాలు భారీగా పెంచబడ్డాయి. 
 
అయితే దీనివల్ల స్మగ్లింగ్ విపరీతంగా పెరిగిపోయిందని పరిశ్రమ వర్గాలు ప్రభుత్వానికి వివరిస్తున్నాయి. అధికారిక మార్గాల ద్వారా వ్యాపారం జరిగేలా చూడటానికి అధికారులు ఈ దిగుమతి సుంకాల సవరణపై దృష్టి సారించారు. 
 
అధిక పన్నుల భారం కారణంగా అక్రమ రవాణా విపరీతంగా పెరుగుతోందని బులియన్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చట్టబద్ధంగా దిగుమతి చేసుకునే విలువైన లోహాలకు, అనధికార మార్గాల ద్వారా వచ్చే వాటికి మధ్య ధరల వ్యత్యాసం భారీగా ఉంటోంది.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
మొబైల్ ఫోన్ వాడకంపై తండ్రి మందలింపు: యువతి రైలుకింద పడి ఆత్మహత్య