1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. చైల్డ్ కేర్

ఎండలో తిరగనీయకండి..!

బాలప్రపంచం చైల్డ్ కేర్ వేసవి కాలం చిన్నారులు సమ్మర్ క్యాంపులు విహార యాత్రలు తీర్థయాత్రలు పెళ్ళిళ్ళు ఇన్ఫెక్షన్లు
వేసవి కాలంలో చిన్నారులను ఎక్కువగా ఎండలో తిరగనీయకుండా జాగ్రత్తపడాలి. బయటి ప్రదేశాల్లో కాకుండా, లోపలనే నిర్వహించే సమ్మర్ క్యాంపుల్లాంటి వాటికి పిల్లలను పంపించటం మంచిది. చాలామంది వేసవిలో విహార యాత్రలు, తీర్థయాత్రలు, పెళ్లిళ్లకు హాజరవుతుంటారు. వీటి వల్ల ఎక్కువమంది ఒకేచోట కలుస్తుంటారు.

దీంతో ఎవరికైనా జలుబు, దగ్గు, ముక్కు చీదడం లాంటి ఇన్‌ఫెక్షన్లు ఉన్నట్లయితే.. అవి ఇతరులకు కూడా వ్యాపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో చేతిరూమాలు అడ్డుపెట్టుకుని దగ్గడం, చీదటం లాంటివి చేయాలి. సమస్య తీవ్రమయినట్లయితే.. సంబంధిత వైద్యుణ్ణి సంప్రదించాలి. ముఖ్యంగా ఇన్‌ఫెక్షన్లు ఉన్న చోటికి చిన్నారులను తీసుకెళ్లకపోవడం ఉత్తమం.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి