1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. చైల్డ్ కేర్

ఎన్ని గంటలు చదివినా...!

బాలప్రపంచం చైల్డ్ కేర్ పిల్లలు పుస్తకాలు గంటలు పాఠాలు మెదడు చదువు దృష్టి ఒత్తిడి శబ్దాలు ధ్వనులు
కొంతమంది పిల్లలు పుస్తకాలు ముందేసుకుని ఎన్ని గంటల చదివినా పాఠాలు మెదడులోకి ఎక్కవు. చదువుమీద దృష్టి నిలవడం లేదని చెబుతుంటారు. దీనికి కారణం... పిల్లలు ఒత్తిడికి గురవుతుండవచ్చు లేదా మెదడు బాగా అలసిపోయి ఉండవచ్చు. వీటి ఫలితంగానే చదువుమీద దృష్టిపెట్టలేక పోతుంటారు.

కాబట్టి పెద్దవారు పిల్లలను ఆ పరిస్థితి నుండి బయటకు తీసుకువచ్చినట్లయితే... వారిలో అద్భుతమైన మార్పు వస్తుంది. ముందుగా గంటలతరబడీ చదవడాన్ని మాన్పించాలి. చదువుకునేందుకు తగిన గాలి, వెలుతురు ఉండే ప్రదేశంలో కూర్చోబెట్టాలి. చదువుకుంటున్నప్పుడు ఎలాంటి శబ్దాలు, ధ్వనులు లేకుండా చేయాలి. ఇవన్నీ చేసిన తరువాత చూడండి.. మీ పిల్లల్లో వచ్చిన మార్పు మీకు స్పష్టంగా తెలిసివస్తుంది.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి