కాంటనీస్ ఫ్రైడ్‌రైస్
కావలసిన పదార్థాలు :
అన్నం... రెండు కప్పులు
ఉడికించిన ప్రాన్స్... వంద గ్రాములు
ఉడికించిన హోమ్ ముక్కలు... 50 గ్రాములు
పచ్చిబఠాణీ... వంద గ్రాములు
ఉల్లికాడల ముక్కలు... 2 కట్టలు
దోసకాయ ముక్కలు... ఒక కాయ
టొమోటో ముక్కలు... ఒక కాయ
ఉల్లికాడల స్లైసెస్... ఒక కాడ
ఉప్పు, మిరియాలపొడి... సరిపడా
కోడిగుడ్లు... రెండు
నూనె... తగినంత
తయారీ విధానం :
పెనం వేడిచేసి 2 గుడ్ల మిశ్రమం వేసి పల్చగా ఆమ్లెట్ లాగా వేసి, వేగిన తరువాత కొంచెం చల్లబరచాలి. ప్యాన్‌లో 4 టీస్పూన్ల నూనె వేసి కాగిన తరువాత అందులో బఠాణీ, ఉల్లికాడలు వేసి ఒక నిమిషంపాటు వేయించాలి. వీటిలో అన్నం కలిపి, ప్రాన్స్ (రొయ్యలు), హోమ్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిసేలా కలియబెట్టాలి. తరువాత దీనిని సర్వింగ్ డిష్‌లో పెట్టి చుట్టూ... టమోటో ముక్కలు, ఉల్లి, దోసకాయల ముక్కలు, ఆమ్లెట్ పీసెస్ పెట్టి అలంకరించి వేడివేడిగా అతిథులకు వడ్డించండి.