1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చైనీస్

చైనా ఫిష్ ఫ్రై

మీకు నచ్చి చేప ఒక పెద్దది బియ్యప్పిండి  రెండు టీస్పూన్లు వెనిగర్  ఒక టీస్పూన్ పచ్చిమిర్చి సాస్ - రెండు టీ  స్పూన్లు
FileFILE
కావలసిన పదార్థాలు :
మీకు నచ్చి చేప - ఒక పెద్దది, బియ్యప్పిండి - రెండు టీస్పూన్లు, వెనిగర్ - ఒక టీస్పూన్, పచ్చిమిర్చి సాస్ - రెండు టీ స్పూన్లు, పెద్ద ఉల్లిపాయలు - ఒకటిన్నర, నూనె - ఒకటిన్నర కప్పు, ఉప్పు - తగినంత.

తయారు చేయు విధానం :
ముందుగా చేపను శుభ్రం చేసి రెండు ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. తర్వాత బియ్యప్పిండి, వెనిగర్, ఉప్పులను కలిపి చేపపై రాసి పది నిముషాల పాటు ఉంచాలి. బాణాలిలో కాస్త నూనె వేసి కాగాక సన్నగా తరిగి ఉల్లి ముక్కలను వేసి దోరగా వేయించాక పచ్చిమిర్చి సాస్ కూడా వేసి కాస్త ఉప్పు వేసి వేయించాలి.

పెద్ద బాణాలిలో నూనె వేసి బాగా కాగాక అందులో చేపలను మెల్లగా వేయాలి. అవి కాస్త వేగాక రెండు వైపులకు తిప్పి వేపి తీసి పళ్లెంలో పెట్టాలి. ఇంతకు ముందు తయారు చేసుకున్న సాస్ మిశ్రమాన్ని చేపలపై వేసి అన్నంతో వేడిగా సర్వ్ చేయాలి.
About Writer
WD