1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చైనీస్

చైనా వెరైటీ కాలీఫ్లవర్

కావలసిన పదార్థాలు :
కాలీఫ్లవర్ - చిన్నది
కావలసిన పదార్థాలు :
కాలీఫ్లవర్ - చిన్నది, కార్న్ ఫ్లోర్ - మూడు టేబుల్ స్పూన్లు, మైదా పిండి - మూడు టేబుల్ స్పూన్లు, ఉప్పు - తగినంత, వెల్లుల్లి - సన్నగా తరిగిన ఐదు రెబ్బలు, అజినమొటో - పావు స్పూన్, పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరిగినవి), రెడ్ మిర్చి - మూడు (సన్నగా తరిగినవి), ఉల్లితూడలు - ఓ కట్ట, ఉల్లిపాయలు - ఒకటి, సోయా సాస్ - మూడు స్పూన్లు.

తయారు చేయు విధానం :
ముందుగా కాలీఫ్లవర్ పువ్వులను విడివిడిగా తీసి పెట్టుకోవాలి. ఓ పాత్రలో నాలుగు కప్పుల నీళ్లు పోసి కాయాలి. ఇందులో కాలిఫ్లవర్ పువ్వులను వేసి ఉడికించి తీసి ఆ నీటిని వడగట్టి గ్రేవీ కోసం పక్కన పెట్టుకోవాలి. మైదా పిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు, కాస్త కారం, అజినమోటొ, పావు స్పూన్ సోయా సాస్, కాస్త వెల్లుల్లిలను కలిపి కాసిని నీళ్లు పోసి బజ్జి పిండిలాగ కలిపి పెట్టుకోవాలి.

ఈ పిండిలో కాలీఫ్లవర్ ముక్కలను ముంచి తీసి కాగిన నూనెలో వేయించాలి. అలాగే మరో బాణాలిలో నూనె వేసి వెల్లుల్లి, పచ్చిమిర్చి, రెడ్ చిల్లీ పొడిలను వేయాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిముక్కలు, ఉల్లి కాడలను వేసి వేయించాలి. ఉల్లి వాసన పోయిన తర్వాత ఇందులో సోయా సాస్ వేసి కాలిఫ్లవర్‌ను ఉడికించిన నీటిని పోయాలి.

రెండు చెంచాల కార్న్‌ఫ్లోర్‌ను నీళ్లలో కలిపి ఇందులో పోయాలి. సర్వ్ చేసేటప్పుడు కాలిఫ్లవర్‌పై ఈ గ్రేవిని అలంకరించి సర్వ్ చేయాలి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT