1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చైనీస్

చైనీస్ ఫ్రైడ్‌రైస్

వంటకాలు చైనీస్ ఫ్రైడ్‌రైస్ పులావ్ రైస్ ఉల్లిపాయలు ఏలక్కాయలు బటర్ ఉప్పు
FileFILE
కావలసిన పదార్థాలు:
పులావ్ రైస్... 500 గ్రాములు
ఉల్లిపాయలు... నాలుగు
ఏలక్కాయలు... మూడు
బటర్... 200 గ్రాములు
ఉప్పు... తగినంత
ఉల్లిపాయ తరుగు... సరిపడా
కొత్తిమీర తరుగు... సరిపడా

తయారీ విధానం :
వేడయిన ప్యాన్‌లో వెన్నను వేడిచేసి అందులోనే ఏలక్కాయలు, తరిగిన ఉల్లి ముక్కలను వేసి వేయించాలి. ఇందులో పులావ్ బియ్యాన్ని వేసి కలపాలి. బియ్యం బాగా వేగాక అందులో తగినంత ఉప్పు వేసి కలిపి నాలుగు గ్లాసుల నీటితో ఉడికించాలి. ఈ బియ్యం ఉడికాక అందులో ఉల్లిపాయ తరుగులు, కొత్తిమీర తరుగుల్ని వేసి అలంకరించి సర్వ్ చేయాలి. ఈ రైస్‌కు టమోటాసాస్‌ను సైడ్‌డిష్‌గా వాడుకోవచ్చు. ఈ రైస్‌లో కావాలనుకున్నవారు ఉడికించిన వెజిటబుల్స్‌ను కూడా వేసుకోవచ్చు.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి