టైగర్ ప్రాన్స్ టార్మిండో
కావలసిన పదార్థాలు :
టైగర్ ప్రాన్స్... పావుకేజీ
మయొనెస్ సాస్... ఒక కప్పు
పాలు... పావు లీటర్
చక్కెర... 15 గ్రా.
క్రీమ్... 50 గ్రా.
ఉప్పు... సరిపడా
క్యాప్సికం సాస్... అర టీ.
క్యారెట్‌లు... రెండు
క్యాబేజీ... 50 గ్రా.
మైదా...50 గ్రా.
అమూల్ ఛీజ్... పది గ్రా.
8 టు 8 సాస్... అర టీ.
అముల్ బట్టర్... 50 గ్రా.
తయారీ విధానం :
ముందుగా క్యాబేజీ, క్యారెట్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిపై మయొనెస్ సాస్ పోసి బాగా కలిపి ఒక ప్లేట్‌లో నిండుగా సర్ది ఉంచాలి. టైగర్ ప్రాన్స్‌ను సరిపడేంత నీరు పోసి ఉడికించి నీటిని వంపేసి పక్కన ఉంచుకోవాలి.
ఒక కడాయిలో బట్టర్ వేసి వేడయ్యాక మైదా పిండి వేసి వేయించాలి. దాంట్లో పాలు, చక్కెర, ఉప్పు, తురిమిన ఛీజ్, క్రీమ్, 8 టు 8 సాస్, క్యాప్సికం సాస్‌లను వరుసగా వేసి చిక్కబడేంతదాకా కలియబెట్టాలి. అందులోనే ఉడికించిన టైగర్ ప్రాన్స్‌ను వేసి సన్నటి సెగపై మరికొంతసేపు ఉడికించాలి.
ఉడికిన తరువాత దించేసి.. క్యాబేజీ, క్యారెట్‌లతో పైన సర్ది ఉంచుకున్న ప్లేటులో పోయాలి. అంతే టైగర్ ప్రాన్స్ టార్మిండో రెడీ అయినట్లే...! దీనిని బ్రెడ్ లేదా రోల్స్‌తో కలిపి అతిథులకు వడ్డించండి.