1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చైనీస్

స్పైసీ ఫ్రైడ్ ష్రింప్స్

వంటకాలు చైనీస్ రొయ్యలు స్పైసీ ఫ్రైడ్ ష్రింప్స్ క్యాప్సికమ్ ఉల్లిపాయ ఆవాలు వెనిగర్ వెల్లుల్లి కారం నిమ్మచెక్క నూనె ఉల్లిపాయ
FileND
కావలసిన పదార్థాలు :
రొయ్యలు... పావుకేజీ
క్యాప్సికమ్... ఒకటి
ఉల్లిపాయ... ఒకటి
ఆవాలు... ఒక టీస్పూన్
వెనిగర్... తగినంత
వెల్లుల్లి... మూడు రేకలు
కారం.. రెండు టీస్పూన్లు
నిమ్మచెక్క... ఒక టీస్పూన్
నూనె... రొయ్యలను వేయించేందుకు సరిపడా

తయారీ విధానం :
ఉల్లిపాయలు, క్యాప్సికమ్, నిమ్మచెక్కను అందంగా తరిగి ఉంచుకోవాలి. అల్లం, ఆవాలు, వెల్లుల్లి పేస్ట్‌లాగా చేసుకోవాలి. దీనికి వెనిగర్ కలిపి ఉంచాలి. రొయ్యలను బాగా కడిగి వాటికి ఉప్పు, పసుపు పట్టించి పక్కన ఉంచుకోవాలి.

ఆ తరువాత రొయ్యలను కాగుతున్న నూనెలో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బాణలిలో మూడు టీస్పూన్ల నూనె వేసి అందులో ఉల్లిపాయలను వేయించి తీసి పక్కకు తీసేయాలి. అదే బాణలిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను కూడా వేసి తక్కువ మంటమీద కొద్దిసేపు వేయించాలి. దాంట్లోనే వేయించి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యాప్సికమ్‌లను కలిపి మరికాసేపు ఉడకనిచ్చి, చివర్లో రొయ్యలను కలపాలి. అంతే స్పైసీ ఫ్రైడ్ ష్రింప్స్ రెడీ అయినట్లే..!
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి