1. ఇతరాలు
  2. »
  3. జాతీయ కాఫీ మండలి
  4. »
  5. కాఫీ రూమ్

వేడి వేడి కాఫీ రూమ్

కాఫీ రూమ్ వేడివేడి కాఫీ భలే రుచి
WD
విత్తనం దశ నుంచి కప్పు వరకు కాఫీ గింజ ప్రయాణం ఆసక్తికరంగా ఉంటుంది. కాఫీ సేవించేవారికి ఎవరికైనా, ఏ చిన్న విషయమైనా, ప్రేమపూర్వక నేపథ్యాన్ని అందించినా లేక ఓ మంచి కప్పును ఎలా తయారుచేయాలో తెలియజేసినా, మొత్తం కాఫీ అనుభవం నిరంతరం మెరుగవుతూనే ఉంటుంది.

దాదాపు దశాబ్దానికి పైగా, భారతదేశంలో కాఫీ వ్యాపారరంగం పలు భారీ మార్పులకు లోనైంది. 1996లో జరిగిన కాఫీ వ్యాపార సరళీకరణ మూలంగా దేశీయ అవసరాలు మరియు ఎగుమతులకై గ్రీన్ కాఫీ వినియోగంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అలాగే, దీని ప్రోత్సాహంతో వ్యాపారులు రిటైల్ వ్యాపారాన్ని పూర్తిగా మూసివేసి, భారతదేశంలోని పలు చోట్ల కొన్ని వందల కేఫ్‌లను నెలకొల్పారు.

ఈమధ్య కాలంలో, భారతీయ సంస్థల విజయాలను చూసిన, విదేశీ పెట్టుబడుదారులు మార్కెట్‌లోకి ప్రవేశించి, భారతదేశంలో కొన్ని ప్రపంచ కాఫీ సంస్థలు కొత్త వెంచర్‌లను ప్రారంభించాయి. ఇవి అన్నీ భారతదేశంలో నూతన మరియు ఉత్తేజకరమైన కాఫీ సమాజాన్ని సూచిస్తున్నాయి, కాఫీ ట్రేడ్ కోసం అత్యధికంగా ఉత్సుకతను ప్రదర్శించే వాతావరణం అభివృద్ధి చెందుతుంది. అదే విధంగా వినియోగదారులు కూడా ఉత్సుకతను చూపుతున్నారు.

మంచి కాఫీ కోసం చూపిస్తున్న ఆసక్తి, కాఫీ పట్ల భారతీయ చైతన్యాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ రోజు ఇటాలియన్ ఎస్ప్రెస్సో మరియు ఇన్‌స్టంట్ కాఫీతో దక్షిణ భారతదేశపు ఫిల్టర్ కాఫీ అందుబాటులో ఉండి, సవాలుగా నిల్చింది. వినియోగదారు టూ-టైర్ స్టెయిన్‌లెస్ స్టీల్ ఫిల్టర్‌లో తయారు చేసిన కాఫీతో మేల్కొనవచ్చు, ఆఫీస్ కేంటీన్ సర్వీస్‌చే అందుకున్న కాఫీని ఆస్వాదించవచ్చు.

సాయంత్రం కాఫీ బార్‌లో స్నేహితులతో కలిసి, ఇటాలియన్ రీతి కాప్పుసినోను ఆస్వాదించవచ్చు. పెరిగే మరియు అమ్మబడే కాఫీ రకాలు, అలాగే వాటినే ఉపయోగించే రీతి వంటిలో కూడా భారతీయ కాఫీ మార్కెట్ వ్యత్యాసంగా ఉంది. అదే సమయంలో, ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కాఫీని వేరే గ్రహపు పానీయంగాను లేదా అరుదుగా దొరికే వస్తువుగాను భావిస్తున్నారు. ఎందుకంటే ఇన్‌స్టాంట్ కాఫీ తక్కువగా అందుబాటులో ఉంది కానీ రోస్ట్ మరియు గ్రౌండ్ రకాలు పూర్తిగా అందుబాటులో లేవు. భారతదేశం నిజంగా క్లిష్టమైన కాఫీ మార్కెట్, అయితే సామర్థ్యపరంగా చక్కటి రివార్డు అందుకోగలదు.

పెరుగుతున్న భారతీయ ఆర్థిక వ్యవస్థచే రూపుదిద్దుకుంటున్న వినియోగదారు జీవనశైలులు మరియు కొనుగోలు అలవాట్లలో మార్పులతో పాటు కాఫీ తాగే అలవాట్లు మరియు వైఖరులు కూడా మారుతున్నాయి. ప్రస్తుతం ఉన్న మార్కెట్‌లను నిదానంగా నడిపిస్తూ, కొత్త వాటిని రూపొందించడం మార్కెటర్లకు సవాలుగా మారింది.

వినియోగదారు నాణ్యమైన కాఫీని పొందేందుకు, నిరంతరం ప్రయోగాలను చేసేందుకు మరియు భారతదేశంలోనూ మరియు అంతర్జాతీయంగానూ రెండింటిలో కాఫీ ప్రపంచపు సుసంపన్న పరిమళాలను వెలికి తీసేందుకు అనుమతించాలి. ఈ గ్రహింపు తప్పనిసరి మరియు ఇవి అన్నీ కాఫీతో ప్రారంభమవుతాయి.

రుచిగా తయారుచేసిన మంచి కాఫీ కప్, జీవితంలోని సాధారణ సంతోషాలలో ఒకటి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT