1. ఇతరాలు
  2. »
  3. జాతీయ కాఫీ మండలి
  4. »
  5. కాఫీ టేబుల్ బుక్

కాఫీ వ్యవసాయం...

కప్పు కాఫీ దినుసు గోధుమరంగు వ్యవసాయం
ఓ కప్పు కాఫీలో ఉండే అతి ముఖ్యమైన దినుసు ఏదంటే కాపీ గింజే! కాఫీ అని మనకు తెలిసిన ఆ గోధుమరంగు పౌడర్ వాస్తవానికి ఓ సుదీర్ఘ ప్రయాణపు అంతిమ ఫలితం.
వ్యవసాయం
దాదాపు అన్ని ఫల వృక్షాల లాగే, కాఫీ చెట్లు సైతం పుష్పించడం, ఫలదీకరణ అనే వార్షిక చక్రాన్ని అనుసరిస్తాయి. జనవరి నుంచి మార్చి నెలదాకా కాఫీ తోటల్లో పనులు వేగం పుంజుకుంటాయి. ఈ కాలంలోనే కాఫీ పళ్లను చేతులతోనే ఏరి, ప్రాసెస్ చేస్తుంటారు. పండ్లలోంచి గుజ్జును తీస్తారు, దాని ఫలితంగా పండులో ఉండే కాఫీ గింజ బయటకు వస్తుంది.

క్యూరింగ్
తోటనుంచి, ప్రాసెస్ చేయబడిన కాఫీని తుది రూపకల్పనలో భాగంగా నిల్వ పనుల విభాగం వద్దకు తీసుకెళతారు. క్యూరింగ్ అనేది యంత్రాలు, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో సాగే దశ. గిడ్డంగులలో ఉంచడం, క్యూరింగ్ చేయడం, ముందస్తుగా శుభ్రపర్చడం, ఊక తీయడం, మెరుగుపెట్టడం, శ్రేణులవారీగా వేరుచేయడం వంటి దశలను క్యూరింగ్ కలిగి ఉంటాయి.

భారతదేశంలో శ్రేణీకరణ ప్రక్రియ అనేది అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించేందుకోసం కాఫీ బోర్డు విధించిన ప్రమాణాల బట్టి జరుగుతుంది. గింజ పరిమాణం మరియు సాంద్రతపై శ్రేణీకరణ ఆధారపడుతుంది. కొన్ని దేశాలు తమ సొంత పద్ధతులద్వారా శ్రేణీకరిస్తుంటాయి. అలాగే వివిధ దేశాలు మరియు/లేదా ప్రయివేట్ సంస్థలు పరీక్షించడం లేదా మెరుగుపెట్టడం ఆ తర్వాత శ్రేణీకరించడం వంటి పనులకు తమ సొంత మౌలిక వసతులను కలిగి ఉంటున్నాయి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT