1. ఇతరాలు
  2. »
  3. జాతీయ కాఫీ మండలి
  4. »
  5. కాఫీ టేబుల్ బుక్

కాఫీలో రకాలు

కాఫీ రకాలు గింజలు కెఫీన్ అరబికా స్వభావం ఘాటు
కాఫీ తోటలు ప్రధానంగా రెండు రకాలుగా పెరుగుతాయి. ఒకటి అరేబికా రకం. ఇది ఎత్తైన ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. రెండోది రొబస్టా రకం. ఇది దిగువ ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. సాపేక్షికంగా చూస్తే కెఫీన్ తక్కువగా ఉండే అరేబికా గింజలు ఘాటు తక్కువ స్వభావంతో ఉంటాయి. రొబస్టా రకం మరింత ఘాటుగా ఉంటుంది. కప్పుకు ఆకారం ఇవ్వడానికి గాను దీనిని బ్లెండ్‌లలో ఉపయోగిస్తారు. అరేబికా రకం మరింత ఘాటు సువాసనను అందించేది కాగా, మంచి సువాసనతో ఉండే ఈ రకం గింజలకు రొబస్టా గింజలతో పోలిస్తే అధిక మార్కెట్ విలువ ఉంటుంది.

భారత్‌లో కాఫీ పెరిగే ప్రాంతాలు
బ్రిటిష్ వారు 1820 ప్రాంతంలో కాఫీని వాణిజ్యపరంగా పెంచడం ప్రారంభించారు. 19వ శతాబ్దం చివరకు కాఫీ ఎస్టేట్‌లు పడమటి కనుమల్లో విస్తరించాయి. ఇవి నేడు భారతీయ కాఫీ పరిశ్రమకు వెన్నెముకలాగా రూపొందాయి. సాంప్రదాయికంగా కాఫీ పండించే దక్షిణాది రాష్ట్రాల్లోని కర్నాటక, కేరళ, తమిళనాడు ప్రాంతాలు దేశం మొత్తంలో పండే కాఫీ గింజల్లో 98 శాతాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి.

దేశీయ కాఫీ ఉత్పత్తిలో 68 శాతం దాకా ఒక కర్నాటకలోనే పండిస్తున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల్లోని తూర్పుకనుమల్లోని గిరిజన ప్రాంతాల్లోనూ, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా, కాఫీని పండిస్తున్నారు. పెద్ద పెద్ద తోటల్లో కార్పొరేట్ తరహాలోనూ, చిన్న క్షేత్రాల్లో చిన్న పెంపకందార్ల ద్వారాను కాఫీని పండిస్తున్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT