1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
  4. kothimera not for garneshing..

కొత్తిమీర గార్నిష్‌కే కాదు... పలు విధాలా మేలు..

kothimera not for garneshing..  vantalu
కొత్తిమీర ఆహార పదార్థాల మీద అలంకరించుకోవడాని మాత్రమే కాకుండా పలు విధాలుగా మేలు చేస్తుంది. మనం తీసుకునే అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరల వంటకాల్లో విరివిగా వేసి తీసుకోవచ్చు. కొత్తిమీరలో విటమిన్లు ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా సమృద్ధిగా ఐరన్ కూడా లభిస్తుంది.
 
శరీరంలో రక్తహీనతను తగ్గిస్తుంది. పొగతాగడం, అలాగే కిమోథెరపీ (రసాయనాలతో చికిత్స చేయడం) వల్ల కలిగిన నష్టం తగ్గించడానికి ఇది దోహదపడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించడంలో, రక్త నాళాల్లో ఆటంకాలను తొలగించడంలోనూ కొత్తిమీర ఉపయోగపడుతుంది.
About Writer
CVR