కాఫీ, టీ మరకలు పోవాలంటే..?
కప్పుల్లో కాఫీ, టీ ఎక్కువసేపు నిల్వ ఉన్నట్లయితే మరకలు పడి, అవి ఒక పట్టాన వదలవు. అలాంటప్పుడు ఒక కప్పు నీటిని తీసుకుని అందులో ఐదారు చుక్కల వెనిగర్‌ను కలిపి, ఆ కప్పుల్లో పోయాలి. అలా రాత్రంతా వాటిని ఉంచి మర్నాడు శుభ్రం చేస్తే మరకలు ఇట్టే మాయమైపోతాయి.

