మాడువాసనా..? తమలపాకు ఉందిగా..!!
వంట చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఏమరు పాటు వల్ల కూరలు మాడిపోతుంటాయి. అలా అని వాటిని పారేయకండి.. ఓ చిన్న చిట్కాతో దాన్ని మళ్లీ నిమిషాల్లో రుచికరంగా మార్చుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే.. మాడిన వంటకాన్ని పైపైన తీసి వేరే పాత్రలో వేయండి. ఇప్పుడు దీనిపై రెండు తమలపాకులు ఉంచి.. సన్నసెగపై మరోసారి వేడిచేయండి. ఐదునిమిషాలయ్యాక దింపేయండి. మాడువాసన అట్టే తీసి పారేసినట్లు, ఎలా మాయమవుతుందో మీకే అర్థమవుతుంది.

