1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Andhra Pradesh Coronavirus Positive Cases, Media Bulletin

ఏపీలో 5 వేలకు దిగువకు కరోనా పాజిటివ్ కేసులు

Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి. మొత్తం కేసులు 5 వేలకు దిగువకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో 4,684 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 
 
తూర్పుగోదావరి జిల్లాలో 1,171 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 73 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదేసమయంలో 36 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. 24 గంటల్లో 7,324 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
 
తాజా కేసులతో కలిపి రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 18,62,036కి పెరిగింది. ఇప్పటి వరకు 17,98,380 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 51,204 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 12,452 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
మన పిల్లలకు ఉద్యోగాలు రావడమే ఐటీ పాలసీ ఉద్దేశం : సీఎం జగన్