సంబంధిత వార్తలు
- ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉగ్రరూపం : 21 వేలు దాటిన పాజిటివ్ కేసులు
- ఫైనల్ టర్మ్ ఎగ్జామ్స్ తప్పనిసరిగా నిర్వహించాల్సిందే : హెచ్ఆర్డీ
- అన్‌లాక్ - 2 : దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు...
- ఆలయాల్లో ప్రసాదాలు - భజనలకు నో చెప్పిన కేంద్రం!
- 18 నుంచి లాక్డౌన్ 4.O : రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు... న్యూ రూల్స్ ఇవే... (video)
తెలంగాణ, కర్ణాటక హై రిస్క్ రాష్ట్రాలు: ఏపీ సర్కారు
తెలంగాణ, కర్ణాటకను సహా హైరిస్క్ రాష్ట్రాలుగా ఏపీలోని వైకాపా సర్కారు పేర్కొంది. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి విధించే క్వారంటైన్ విధానంలో మార్పులు చేస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ, కర్ణాటకల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని జగన్ సర్కారు ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ, కర్ణాటక మినహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల హోమ్ క్వారంటైన్ తప్పనిసరి అంటూ ఆయన పేర్కొన్నారు.
కొన్ని రోజులుగా రెండు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండడం, ఏపీకి సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్న నేపథ్యంలో హై రిస్క్ ప్రాంతాలుగా మార్పులు చేయడం జరిగిందని జవహర్ రెడ్డి తెలిపారు. ఫలితంగా విదేశాల నుంచి ఏపీకి వచ్చే వారు ఖచ్చితంగా ఏడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనన్నారు.
విమాన ప్రయాణికుల్లో 10 శాతం మందిని గుర్తించి ర్యాండమ్‌గా కరోనా పరీక్షలు చేయాలి. విమానాశ్రయాల్లోనే స్వాబ్ టెస్టులు చేసి, 14 రోజుల హోమ్ క్వారంటైన్ వెసులుబాటు కల్పించాలని జవహర్ ప్రకటించారు.
తర్వాతి కథనం
