శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 జులై 2020 (22:28 IST)

స్నాప్‌చాట్ నుంచి కొత్త ఫీచర్.. హియర్ ఫర్ యూ అంటూ..?

Snapchat
చైనా యాప్‌లు నిషేధానికి గురైన నేపథ్యంలో.. దేశీయ యాప్‌లకు క్రేజ్ పెరిగిపోతోంది. తాజాగా దేశీయ యాప్‌లు కొత్త కొత్త ఫీచర్లతో నెటిజన్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా దేశీయ సోషల్‌ మీడియా మెసేజింగ్‌ యాప్ స్నాప్‌చాట్ త్వరలో మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. 
 
గతంలో స్నాప్‌చాట్‌ హెడ్‌స్పేస్‌ అనే ఫీచర్‌ ద్వారా వినియోగదారులకు మానసిక సమస్యలు, మిని మెడిటేషన్‌ తదితర సేవలను అందించింది. ఈ ప్రత్యేక ఫీచర్‌ రూపకల్పనలో చాలా అంశాలను అధ్యయనం చేసినట్లు స్నాప్‌చాట్‌ పేర్కొంది.
 
కాగా కరోనాతో లాక్ డౌన్ కారణంగా దేశ ప్రజలు ఇంటిపట్టునే వుంటూ.. మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో దేశ ప్రజల మానసిక సమస్యలను తీర్చేందుకు స్నాప్‌చాట్‌ యాప్‌ హియర్‌ ఫర్‌ యూ ఫీచర్‌ను త్వరలో ప్రారంభించనుంది. 
 
ఈ ఫీచర్‌లో వినియోగదారులు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలకు పరిష్కారం మార్గాన్ని సూచిస్తుందని స్నాప్‌చాట్‌ యాజమాన్యం పేర్కొంది. కాగా అన్ని రకాల ఉద్యేగ నియంత్రణ, మానసిక సమస్యలకు ఈ ఫీచర్‌ ఎంతో ఉపయోగపడుతుందని స్నాప్‌చాట్‌ యాజమాన్యం తెలిపింది.