బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 జులై 2020 (21:57 IST)

చైనా నుంచి పుట్టుకొచ్చిన కరోనాపై మరో షాకింగ్ న్యూస్.. ఏంటది?

చైనా నుంచి పుట్టుకొచ్చిన కరోనా వైరస్‌పై రోజుకో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వస్తోంది. తాజాగా పరిశోధకులు షాకిచ్చే విషయాన్ని తెలిపారు. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు శరీరంలో తయారైన రోగనిరోధక శక్తి కొన్ని నెలల్లోనే మాయం అవుతోందని లండన్ పరిశోధకులు చెప్తున్నారు. ప్రభుత్వాలు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు.
 
కింగ్స్‌ కాలేజ్‌ లండన్‌ పరిశోధకులు 90 మంది కొవిడ్‌-19 బాధితుల్లో యాంటీబాడీల స్థాయిలను అధ్యయనం చేశారు. కాలం గడిచే కొద్దీ అవి ఎలా మార్పు చెందుతున్నాయో పరిశీలించారు. స్వల్ప, మోతాదు లక్షణాలు ఉన్నవారి రోగనిరోధక వ్యవస్థ కొంతే స్పందించిందని రక్తపరీక్షల్లో గమనించారు. వ్యాధి సోకిన కొన్ని వారాల తర్వాత 60శాతం మందిలో చెప్పుకోదగ్గ స్థాయిలో వైరస్‌కు స్పందన కనిపించింది. 
 
కానీ... 90 రోజుల తర్వాత చాలామంది రోగుల రక్తప్రవాహంలో అసలు గుర్తించదగ్గ స్థాయిలో యాంటీబాడీలే కనిపించలేదు. సాధారణంగా యాంటీబాడీలు రోగకారక వైరస్‌పై పోరాడి తిరిగి ఆరోగ్యం చేకూరుస్తాయి. 
 
సాధారణంగా ఒకసారి యాంటీబాడీలు విడుదల అయ్యాయంటే ఎప్పటికీ అవి శరీరంలోనే ఉండిపోతాయి. కరోనా విషయంలో ఇలా జరగడం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇకపై యాంటీబాడీ టెస్టుల్లో పాజిటివ్‌ వచ్చినంత మాత్రాన తాము సురక్షితంగా వున్నట్లు భావించవద్దని హెచ్చరిస్తున్నారు.