శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 13 జులై 2020 (21:55 IST)

జగన్‌కు బాలయ్యబాబు లేఖ.. సిఎం స్పందిస్తారా?

అసలే ఇద్దరు వేర్వేరు పార్టీ నేతలు. అందులోను ఒక పార్టీ అంటే మరొక పార్టీ అస్సలు పడదు. పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. అలాంటి పార్టీలో ప్రధాన పార్టీ నేతగా ఉన్న బాలయ్యబాబు ఎపి సిఎంకు లేఖ రాశారు. తను రాసిన లేఖను ఫ్యాక్స్ ద్వారా సిఎంకు పంపారు. సిఎంగారు మీరు జిల్లాల పునర్విభజన చేస్తున్నారని విన్నాను. అలా జరిగితే నేను ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయండి అని కోరారు. 
 
అంతేకాదు హిందూపూర్ పార్లమెంటు నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ మంజూరైన నేపథ్యంలో ఆ కాలేజీని హిందూపూర్‌కు సమీపంలో మలుగూరు వద్ద ఏర్పాటు చేయాలని కూడా కోరారు. బాలక్రిష్ణ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి సిఎంకు లేఖ రాసిన దాఖలాలు లేవు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు నేరుగా చంద్రబాబును కలిసి మాట్లాడేవారు. తన నియోజకవర్గంలో డెవలప్మెంట్‌ను చేసుకునేవారు. 
 
కానీ ప్రస్తుతం అధికారం మారిన పరిస్థితుల్లో మొదటిసారి బాలక్రిష్ణ లేఖ రాయడంతో ఇప్పటివరకు ఎలాంటి స్పందన జగన్మోహన్ రెడ్డి నుంచి రాలేదు. దీంతో ఏ విధంగా సిఎం స్పందించారన్నది ఆసక్తికరంగా మారుతోంది.