ఆ పోస్టు మాన్ సర్వీస్ ముగిసింది.. 15 కి.మీ నడిచే ఉత్తరాలను..?

Postman
సెల్వి| Last Updated: గురువారం, 9 జులై 2020 (14:48 IST)
Postman
30 సంవత్సరాల పాటు 15 కిలోమీటర్లు నడిచే ఉత్తరాలను అందించే పోస్టు మాన్ రిటైర్డ్ అయ్యారు. ఈ నేపథ్యంలో పోస్ట్‌మాన్‌గా శివన్ అంకితభావం గురించి తెలుసుకున్న ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ఈ విషయాన్ని బుధవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీంతో శివన్ గురించి తెలుసుకున్న పలువురు అతడి సేవలను ప్రశంసించారు. శివన్ ఇకపై ఆనందకర జీవితాన్ని గడపాలని వారు ఆకాంక్షించారు.

కాగా తమిళనాడుకు చెందిన పోస్ట్‌మాన్ డీ శివన్, కూనూర్‌లోని మారుమూల అటవీ ప్రాంతాలకు ప్రతి రోజూ 15 కిలోమీటర్ల మేర నడిచి ఉత్తరాలను బట్వాడా చేసేవాడు. ఆ అటవీ ప్రాంతంలో నడిచి వెళ్లడం అతడికి రోజుకో దినగండం వంటిది.

ఏనుగులు, ఎలుగుబంట్లు, పులులు వంటి క్రూర జంతువుల బారిన పడకుండా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అతడిని ఏనుగులు, ఎలుగుబంట్లు వెంబడించి సంఘటనలు వున్నాయి. ఇలా సేవలందించిన ఆ పోస్టు మాన్ రిటైర్డ్ అయ్యారని ఐఏఎల్ అధికారి సుప్రియ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ పోస్టు మాన్‌ను నెటిజన్లు కొనియాడుతున్నారు.దీనిపై మరింత చదవండి :