1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Corona Update: Last 24 hours 66 positive cases reported in Andhra Pradesh

ఆంధ్రాలో 66 మందికి... దేశంలో 6,767 మందికి పాజిటివ్

Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 66 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. గత 24 గంటల్లో 11,357 శాంపిళ్లను పరీక్షించగా మరో 66 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదేసమయంలో 29 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది.
 
ఇకపోతే, రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసులు 2,627 అని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 764 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,807 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 56కి చేరింది
 
అలాగే, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 6,767 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. 
 
అదేసమయంలో 147 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మృతుల సంఖ్య 3,867కి చేరింది. ఇక కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,31,868కి చేరింది. 73,560 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
కరోనా పరీక్షకు నిరాకరించాడనీ కొట్టి చంపేశారు.. ఎక్కడ?