మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 మే 2020 (09:24 IST)

జూన్ నెలాఖరుకు కరోనా స్వైర విహారం తప్పదు : సీసీఎంబీ

వచ్చే జూన్ నెలాఖరు నాటికి దేశంలో కరోనా వైరస్ స్వైర విహారం తప్పదని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా తెలిపారు. ప్రస్తుతం దేశంలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా వైరస్ వ్యాప్తిపై ఆయన స్పందిస్తూ, ఈ వైరస్ వ్యాప్తి జూన్ నెలాఖరు నాటికి ఇది మరింత తారాస్ధాయికి చేరుతుదన్నారు. 
 
ఈ వైరస్ మనిషి నుంచి మనిషికి సంక్రమిస్తోంది. అలాగే, భూమి నుంచి ఈ వైరస్ సోకుతోందన్నారు. ఇత్యాది కారణాల రీత్యా జూన్ నెలాఖరు నాటికి తారా స్థాయికి చేరుతుందని ఆయన తెలిపారు. 
 
నిజానికి ప్రస్తుతం నమోదైన కేసుల సంఖ్య కంటే అధికంగానే వాస్తవ పరిస్థితి ఉందన్నారు. దీనికి కారణం సరైన పరీక్షలు చేయకపోవడం వల్లేనని చెప్పారు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వందకు వంద శాతం కరోనా టెస్టులు చేయడం లేదని గుర్తుచేశారు. 
 
హైడ్రాక్సీక్లోరోక్వీన్‌తో గుండె సమస్యలు .. ఐసీఎంఆర్ 
హైడ్రాక్సీ క్వోరోక్విన్ మాత్రలు తీసుకుంటే కొవిడ్-19 వైరస్ బారిన పడే అవకాశాలను తగ్గిస్తుందని ఇండియన్  కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కనుగొంది. కానీ కరోనా రోగుల్లో ఈ మాత్రలు తీసుకోవడం వల్ల గుండెకు ముప్పు పెరుగుతుందని హెచ్చరించింది. 
 
కరోనా వైరస్ నివారణకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు ఉపయోగపడతా? లేదా అనే అంశంపై ఐసీఎంఆర్ పరిధోన చేసింది. దీనిపై సానుకూల ఫలితాలు వచ్చినట్టు తెలిపింది. దేశంలో కరోనాపై పోరాడుతున్న ఆరోగ్య శాఖ కార్యకర్తలు, వైద్యులు కరోనా బారినపడకుండా వారి రోగనిరోధక శక్తి పెంచేందుకు హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలను వాడాలని ఐసీఎంఆర్ సిఫారసు చేసింది. 
 
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ లో 334 మంది ఆరోగ్యకార్యకర్తలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లను ఆరు వారాల పాటు తీసుకోగా, వారిలో కరోనా సంక్రమణ తక్కువగా ఉందని తేలింది. 
 
కొవిడ్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఆరోగ్యశాఖ కార్యకర్తలు, వైద్యులకు కరోనా సోకకుండా ముందుజాగ్రత్త చర్యగా హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు అందించాలని ఐసీఎంఆర్ సిఫారసు చేసింది. 
 
ఆరోగ్య కార్యకర్తలే కాకుండా కంటైన్మెంటు జోన్లలో విధులు నిర్వర్తిస్తున్న పారామిలటరీ, పోలీసు, మున్సిపల్ కార్మికులు కరోనా రాకుండా హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లు తీసుకోవాలని ఐసీఎంఆర్ సూచించింది.