తెలంగాణాలో కొత్తగా 62 పాజిటివ్ కేసులు.. జగిత్యాలలో కలకలం

telangana covid
ఠాగూర్| Last Updated: శుక్రవారం, 22 మే 2020 (22:33 IST)
తెలంగాణా రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 62 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 42 కేసులు ఉండటం ఇపుడు హైదరాబాద్ నగర వాసులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని రోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఈ కేసులు ఎక్కువగా నమోదవుతూ వస్తున్నాయి.

ముఖ్యంగా, జీహెచ్ఎంసీ పరిధిలో 19 మంది వలస కూలీలకు, రంగారెడ్డి జిల్లాలో ఒక కేసు చొప్పున నమోదయ్యాయి. అలాగే శుక్రవారం ముగ్గురు చనిపోగా, రాష్ట్రంలో మొత్తం కరోనా మృతులు 48కి చేరాయి. మరో ఏడుగురు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో మరో 670 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇదిలావుంటే, జగిత్యాలలో కలకలం రేగింది. ఈ జిల్లాలో తొమ్మిది మంది వలస కూలీలకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో స్థానికుల్లో ఆందోళన ఎక్కువైంది. ఈ తొమ్మిది మంది వలస కూలీలు ముంబై నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. దీంతో ఈ జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 33కి చేరాయి.దీనిపై మరింత చదవండి :