సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 మే 2020 (18:05 IST)

బీఎస్ఎఫ్‌లో 21 మందికి కరోనా.. భారత్‌లో లాక్‌డౌన్‌తో తగ్గాయట..

బీఎస్ఎఫ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా శనివారం మరో 21 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు బీఎస్ఎఫ్‌ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. గత 24 గంటల్లో బీఎస్ఎఫ్‌లో కొత్తగా 21 మంది జవాన్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం వారు అందరినీ గుర్తింపు పొందిన కోవిడ్‌-19 హెల్త్‌కేర్‌ సెంటర్లకు తరలించి చికిత్స అందిస్తున్నామని ప్రకటనలో పేర్కొంది.
 
కాగా శనివారం నమోదైన 21 కేసులతో కలిపి బీఎస్‌ఎఫ్‌లో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 406కు చేరింది. అయితే, వారిలో 286 మంది వైరస్‌ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, మరో 120 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.
 
అమెరికాలోని మిచిగన్ యూనివర్సిటీ భారత్‌లో కరోనా ప్రభావంపై చేసిన అద్యాయనం ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. భారత్‌లో కేసులు పెరుగుతున్నప్పటికీ.. లాక్‌డౌన్ వలన ఈ మహమ్మారిని కట్టడి చేయడంలో చాలా వరకు సఫలమయ్యారని అన్నారు. లాక్‌డౌన్‌తో 60శాతం వరకూ కరోనా వ్యాప్తి తగ్గిందని తేల్చింది. కరోనా వ్యాప్తి వేగాన్ని కనిపెట్టడానికి ఆర్‌నాట్ అనే ఒక ముఖ్యమైన ప్రాతిపదిక ఆధారంగా పరిశోధన చేస్తారు. 
 
ఈ ఆర్‌నాట్ అనేది ఒక వ్యక్తి నుండి కరోనా ఎంత మందికి సోకింది అనే ఒక సంఖ్యను సూచిస్తుంది. లాక్‌డౌన్ విధించే నాటికి అంటే.. మే24 నాటికి ఈ విలువ 3.36గా ఉంది. అయితే.. తరువాత అది తగ్గుతూ ఏప్రిల్ 14 నాటికి 1.71గా.. మే 3 నాటికి ఇది 1.46కి.. చివరికి మే16 నాటికి బారీగా తగ్గి 1.27కు చేరుకుందని ఈ అధ్యాయంలో తేలింది.