శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 మే 2020 (16:59 IST)

బోనీ కపూర్ ఇంట్లో మరో ఇద్దరికీ కరోనా.. క్వారంటైన్‌లో జాన్వీ ఫ్యామిలీ

Boney Kapoor
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఇంట మరో కరోనా కేసు కలకలం రేపింది. ఇప్పటికే 23 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు బోనీకపూర్ ప్రకటించగా, తాజాగా వారి ఇంట్లో మరో ఇద్దరికి కరోనా సోకింది. ముంబైలోని లోకంద్‌వాలాలో బోనీ తన ఇద్దరు కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ కలిసి వుండగా, వారి ఇంట్లో ప్రస్తుతం ముగ్గురు ఈ వైరస్‌ బారిన పడ్డారు. 
 
దీనిపై బోనీ కపూర్ ప్రతినిధి మాట్లాడుతూ.. బోనీకపూర్‌ ఇంట్లో మంగళవారం ఒకరికి కరోనా సోకడంతో ఇంట్లోని అందరికీ పరీక్షలు చేశారని చెప్పారు. వారిలో ఇద్దరికి పాజిటివ్‌ అని తేలగా, మిగిలిన అందరికీ నెగిటివ్ వచ్చిందన్నారు. 
 
బోని, జాన్వీ, ఖుషీలకు పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చిందని తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వారు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా క్వారంటైన్‌లో ఉన్నారు. బోని, జాన్వీ, ఖుషీలు కూడా హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నారన్నారు. తన స్టాఫ్ మెంబర్లకు కావాల్సిన చికిత్సను బోనీకపూర్ చేయిస్తున్నారన్నారు.