శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 మే 2020 (18:00 IST)

పాపం బాడీ బిల్డర్ ... కరోనా దెబ్బకు కండల కరిగిపోయాయ్...

అతనో బాడీ బిల్డర్. గతంలో పలు ఈవెంట్లలో పాల్గొన్నాడు. ఆయనకు కరోనా వైరస్ సోకింది. ఈ వైరస్ సోకక ముందు ఆయన బరువు 86 కేజీలు ఉండేవాడు. ఈ వైరస్ సోకిన తర్వాత అతని బరువు 63 కేజీలకు పడిపోయింది. పైగా, శరీరమంతా మెలితిరిగిన కండలు ఉండేవి. కానీ, ఇపుడు కరోనా దెబ్బకు కండలు పూర్తిగా కరిగిపోయి, బక్క జీవిలా మారిపోయాడు. ఇంతకీ ఆ బాడీ బిల్డర్ పేరు మైక్ షుల్జ్. వయస్సు 43 యేళ్లు. అమెరికా దేశస్థుడు. 
 
ఈయనకు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆస్పత్రిలో చేరాడు. మొత్తం ఆరు వారాల పాటు అటు నెలన్నర రోజులు ఆస్పత్రిలోనే వున్నాడు. కాలిఫోర్నియాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కరోనాపై విజయం సాధించాడు. 
 
ఈ క్రమంలో ఆయన ఏకంగా 23 కిలోల బరువు కోల్పోయాడు. అతడికి చికిత్స అందించిన ఆసుపత్రిలోని ఓ నర్సు అతని తాజా ఫొటోలను పోస్టు చేయడంతో అతని ఫాలోవర్లు విస్తుపోయారు. కరోనా సోకకముందు 86 కిలోల బరువున్న షుల్జ్ కోలుకున్నాక 63 కిలోల బరువు తూగాడు. 
 
దీనిపై సదరు బాడీబిల్డర్ వ్యాఖ్యానిస్తూ, ఈ ఫొటోలను తాను ప్రదర్శించడానికి కారణం, కరోనా ఎవరికైనా సోకుతుందని చెప్పడానికేనని పేర్కొన్నాడు. ఆరు వారాల పాటు మందులతోనూ, లేదా, వెంటిలేటర్ పైనా గడపాల్సి రావడం ఎవరికైనా తప్పకపోవచ్చన్నది తన అభిప్రాయమని తెలిపాడు.