1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Coronavirus, scan centers that charge thousands of rupees for scanning in warangal

వరంగల్ జిల్లాలో కరోనావైరస్ చికిత్స రూపంలో దోచేస్తున్నారు

Coronavirus
వరంగల్ జిల్లా కేంద్రంలో ప్రైవేటు స్కానింగ్‌ సెంటర్స్ కొత్త దందాకు తెర తీశాయి. ప్రజలకు ఉన్న కరోనా భయాన్ని ఆసరా చేసుకుని ప్రైవేట్ వైద్యులతో కలిసి దోచుకు తింటున్నాయి. 
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 2800 పాజిటివ్ కేసులు  నమోదు కాగా ఒక్క అర్బన్ జిల్లాలోనే 1500 పాజిటివ్ కేసులు ఉన్నాయి. అంతేకాదు ప్రతి రోజు 200కు పైగా పాజిటివ్ కేసులు వస్తున్నాయి.
 
ఈ తరుణంలో దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు ఉంటే ప్రజలు వణికిపోతున్నారు. ఏ చిన్న సమస్య తలెత్తినా కరోనా సోకిందేమోననే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితులనే క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి స్కానింగ్ సెంటర్స్. దగ్గు, జలుబు, ఇతర ఛాతీ సంబంధిత సమస్యలు ఉంటే వైద్యుల వద్దకు వస్తున్నారు రోగులు.
 
తాము సొంతంగా నెలకొల్పిన స్కానింగ్‌ కేంద్రాలు, లేదంటే కమీషన్లు ఇచ్చే స్కానింగ్ సెంటర్లకు హైపర్‌ రెస్పిరేటరీ స్కానింగ్‌ల కోసం సిఫార్సు చేస్తున్నారు. అయితే హైపర్‌ రెస్పిరేటరీ స్కానింగ్‌ కోసం గతంలో 2 వేలు తీసుకుంటే ఇప్పడు 4 వేల నుంచి 8 వేల వరకు దండుకుంటున్నారు.
 
హైపర్‌ రెస్పిరేటరీ స్కానింగ్‌ తీస్తే శ్వాస సంబంధిత సమస్యలను గుర్తించడంతో పాటు కరోనా వైరస్‌ ప్రభావాన్ని తెలుసుకోవడాని ఉపయోగ పడుతుంది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో సీజనల్‌ వ్యాధుల బారిన పెద్దవాళ్ళు  ఆసుపత్రులకు వెళ్తే సాధారణ దగ్గు, జలుబు, ఇతరత్రా సమస్యలకు సాధారణ ఎక్స్‌రేలు కాకుండా హైపర్‌ రెస్పిరేటరీ స్కానింగ్‌లు రాస్తూ కరోనా భయం చూపెట్టి వేలాది రూపాయలు దండుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తర్వాతి కథనం
ప్రియురాలితో గొడవలు.. కూతురిని నగ్నంగా చిత్రీకరించాడు.. ఆపై బెదిరించాడు..?