1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Covid Cases increasing Banglalore and India

భారీగా పెరిగిపోతున్న కరోనా కేసులు... ఐటీ నగరంపై వైరస్ పంజా

coronavirus
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 298 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 4334కు చేరుకుంది. గత 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసుల్లో ఒక్క బెంగుళూరు నగరంలోనే ఏకంగా 172 కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. 
 
కర్ణాటకలో ప్రస్తుతం 1,240 యాక్టివ్ కేసులు ఉండటంతో రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దేశంలో జేఎన్-1 సబ్ వేరియంట్ కేసులు 500 దాటాయి. ప్రస్తుతం దేశంలో 541 జేఎన్-1 కేసులు ఉన్నాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

కర్ణాటకలో అత్యధికంగా 199, ఆ తర్వాత కేరళలో 148 కేసులు ఉన్నాయి. తెలంగాణలో 2 కేసులు ఉన్నాయి. మిజోరం, చండీగఢ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, మేఘాలయాలలో కేసులు నమోదు కాలేదని అధికారులు తెలిపారు.
తర్వాతి కథనం
ఓట్లు అడిగేందుకు వస్తే చెప్పుతో కొడతాం... : మంత్రి అంబటికి షాక్