బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 డిశెంబరు 2023 (13:14 IST)

దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులు - కొత్తగా 743

Covid test
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. గత 24 గంటల సమయంలో కొత్తగా 743 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది. ఈ కేసులతో కలిపి మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3997కు చేరుకున్నాయి. 
 
శనివారం ఉదయం 8 గంటల వరకు గత 24 గంటల్లో దేశ వ్యాపత్ంగా మొత్తం 743 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఏడుగురు కరోనా బాధితులు ప్రాణాలు విడిచారు. ఇందులో కేరళలో 3, కర్నాటక 2, ఛత్తీస్‌ఘడ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. మరోవైపు, డిసెంబరు 5 వరకు జారీ చేసిన కేసుల సంఖ్య రెండంకెలలో ఉండగా, చల్లని వాతావరణం పరిస్థితులు, కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్1 పంజాతో మూడు వారాల్లోనే కేసుల సంఖ్య వందల్లోకి చేరింది. 
 
మంత్విత్వ శాఖ వెబ్ సెట్ ప్రకారం దేశంలో కరోనా మహమ్మారి అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా 4.5 కోట్ల మంది ప్రజలు ఈ వైరస్ బారినపడ్డారు. 5.3 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీని నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.4 కోట్ల చేరింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లు పంపిణీ చేసినట్టు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 
 
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ సర్కారు 
 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్త సంవత్సరం నుంచి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షన్‌దారులకు జనవరి ఐదో తేదీలోపు వేతనాలు, పెన్షన్లు జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. 
 
ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఇచ్చే నిధులను కొన్ని రోజుల పాటు ఆపి అయినా సరే జనవరి 5వ తేదీలోపే వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం. 
 
గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగులు మద్దతు తెలపడంతో వారి రుణం తీర్చుకొనే దిశగా రేవంత్ సర్కారు అడుగులు. ఆ దిశగా ఈనెల వేయాల్సిన రైతుబంధు, ఇతర సంక్షేమ పథకాల నిధులు ఆపి జనవరి 5 లోపు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు జమ చేయాలని నూతన ప్రభుత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
 
గ్లోవ్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. మంటల్లో కాలిపోయిన కార్మికులు 
 
మహారాష్ట్రంలోని ఛత్రపతి శంభాఝీ నగరంలో‌‍ ఆదివారం తెల్లవారు జామున్న గ్లోవ్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మంటల్లో చిక్కుకునిపోవడంతో వారు సజీవదహనమయ్యారు. వాలూజ్ ఎంఐడీసీ ప్రాంతంలో ఉన్న హ్యాండ్ గ్లోవ్స్ తయారీ కంపెనీలో ఆదివారం తెల్లవారు జామున 2.15 గంటలకు ఈ అగ్నిప్రమాదం జరిగింది. 
 
భవనంలో చిక్కుకున్న తమ బంధువులను రక్షించేందుకు సహాయం కోసం ప్రజలు హాహాకారాలు చేస్తున్నట్లు ఆ ప్రాంతం నుంచి దృశ్యాలు చూపించాయి. ఈ అగ్నిప్రమాదంలో ఆరుగురు కార్మికులు సజీవ దహనమయ్యారని ఫైర్ ఆఫీసర్ మోహన్ ముంగ్సే చెప్పారు.
 
రాత్రి కంపెనీ మూసి ఉందని, కంపెనీలో మంటలు చెలరేగాయని కార్మికులు చెప్పారు. మృతులను ఇంకా గుర్తించాల్సి ఉందని పోలీసులు చెప్పారు. మంటలు చెలరేగినప్పుడు భవనం లోపల 10-15 మంది ఉన్నారని, కొందరు తప్పించుకోగలిగారు. మరికొందరు ఇంకా లోపల అగ్నిప్రమాదంలో చిక్కుకున్నారని కార్మికులు తెలిపారు.
 
సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక యంత్రాలు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని భవనంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కంపెనీలో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు.