తెలంగాణాలో కొత్తగా మరో 9 కేసులు - మొత్తం కేసులు 27
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 27కు చేరింది. అలాగే, తెలంగాణాలో రికవరీ రేటు 99.51 శాతంగా ఉంది. రెండు నెలల చిన్నారికి కరోనా సోకడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అయితే, తాజాగా నమోదైన తొమ్మిది కేసుల్లో 8 మంది హైదరాబాద్, ఒకరు రంగారెడ్డి జిల్లా నుంచి ఉన్నారు. తెలంగాణాలో రికవరీ రేటు 99.51 శాతంగా ఉంది. నిలోఫర్‌లో రెండు నెలల చిన్నారికి కరోనా నిర్ధారణ కాగా, ఆ పాపకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో పదేళ్లు లోపు చిన్నారులు, 60 యేళ్ల పైబడిన వారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వీరు తమ నివాసాల నుంచి అనవరసరంగా బయటకు రావొద్దని కోరింది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాలంటే ఖచ్చితంగా ముఖానికి మాస్క్ ధరించాలని సూచింది. జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కనిపిస్తే తక్షణమే కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని సూచించింది.
కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన జేడీ లక్ష్మీ నారాయణ
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీ నారాయణ కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ఆ పార్టీకి జై భారత్ నేషనల్ పార్టీగా నామకరణం చేశఆరు. తన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆయన... క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆయన ప్రజాక్షేత్రంలోకి చేరుకుని వారి సమస్యలను అవగాహన చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. సమస్యలు, పరిష్కారలను వారినే అడిగే తెలుకుంటూ ముందుకుసాగుతన్నారు.
గత 2019 ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన మూడు లక్షల ఓట్లు సాధించారు. ఆ ఎన్నికల తర్వాత కూడా రాష్ట్రంలో పర్యటిస్తూ యువతను, రైతులను, కార్మికులను, మత్స్యకారులను కలిసిన తర్వాత వారి ఆలోచనలు, వాళ్ల ఆకాంక్షలు పరిశీలించారు. ఒక పార్టీ ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు తీసుకురావాలని స్థాపించిన పార్టీ. ఇది పెట్టిన పార్టీ కాదు. ప్రజలు కాంక్షలు, ఆకాంక్షలు, ఆలోచనల్లోనుంచి పుట్టిన పార్టీ. జై భారత్ నేషనల్ పార్టీ అని చెప్పుకొచ్చారు.